హైదరాబాద్ క్రైమ్, అద్దం న్యూస్ : నగరంలోని మీర్పేట్లో నిన్న విదేశీ యువతిపై జరిగిన అత్యాచారం కేసులో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌కు జర్మన్‌కు చెందిన యువతీ, యువకుడు వచ్చారు. అప్పటి నుంచి మీర్పేట్లో ఉండే తమ స్నేహితుడైన శరత్చంద్ర చౌదరి ఇంట్లో ఉంటూ నగరంలోని పలు పర్యాటక కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 31వ తేదీన సమీపంలోని కూరగాయల మార్కెట్‌ను సందర్శించేందుకు ఇంటి నుంచి వారు ఇద్దరు బయలుదేరారు. అదే సమయంలో యాకుత్‌పురాకు చెందిన మహ్మద్ అబ్దుల్ అస్లాం ( 25 ) తన కారులో 9 నుంచి 16 సంవత్సరాలోపు వయస్సు ఉన్న వారితో విదేశీల వద్దకు వచ్చారు. విదేశీయులతో మాటా మాటా కలిపి ఎక్కడికి వెళ్లాలని అని అస్లాం అడిగాడు. వారిని నమ్మిని విదేశీయులు కారు ఎక్కారు. చాంద్రాయగుట్ట నుంచి కారులో ఇంధనం నింపిన తర్వాత వేర్వురు ప్రదేశాల్లో తిప్పి పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి వైపు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత నిందితుడు అస్లాం సెల్ఫీలు దిగాలని విదేశీ యువతి స్నేహితుడు, తన స్నేహితులతో చెప్పాడు. వారు కారు దిగన తర్వాత కారులో ఉన్న విదేశీ యువతిని 100 మీటర్ల దూరం ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. కారులోనే ఆ యువతిపై అస్లాం అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన తర్వాత మిగిలిన వారి వద్దకు వెళ్లాడు. అదే సమయంలో బాధితురాలు కదులుతున్న కారు నుంచి దూకి తన స్నేహితుడిని కలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా దర్యాప్తులో భాగంగా అస్లాం ఉండే యాకుత్‌పురాలోని అతని ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేశానని, కారును అద్దెకు తీసుకుని ఆ కారులో తన స్నేహితులతో కలిసి తిరుగుతుండగా విదేశీ యువతి, యువకుడి చూసి, ప్లాన్ వేసి ఆ యువతి పై అత్యాచారం చేసినట్టు పోలీసుల విచారణలో అస్లాం ఒప్పుకున్నాడు. ఈ మేరకు అస్లాంను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply