బీసీ యువజన సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్‌

బీసీ యువజన సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్‌

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 23, అద్దం న్యూస్ :    బీసీ యువజన సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్ కు నియామ‌క‌ప‌త్రాన్ని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.క్రిష్ణ‌య్య అంద‌చేశారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ బిసి భ‌వ‌న్‌లో నియామ‌క ప‌త్రాన్ని ర‌మేష్‌కు అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్.క్రిష్ణ‌య్య మాట్లాడుతూ… బీసీ యువజన సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా నియ‌మితులైన మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్ బిసిల హ‌క్కుల కోసం అనేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించార‌న్నారు. ర‌మేష్ కుమార్ యాద‌వ్ లాంటి యువ‌త ముందుకు వ‌చ్చి బిసి ఉద్య‌మంలో పాల్గొనాల‌న్నారు. స్వ‌యం ఉపాధి కింద యువతకు రుణాలు మంజూరు చేయాల‌ని, బీసీ కార్పొరేషన్ లో పెండింగ్‌లో ఉన్న రుణాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

బీసీ యువజన సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ… బిసి హ‌క్కుల కోసం ఆర్‌.క్రిష్ణ‌య్య చేస్తున్న పోరాటంలో తాను పాల్గొంటాన‌న్నారు. త‌న పై న‌మ్మ‌కంతో బీసీ యువజన సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా నియ‌మించినందుకు ఆర్‌.క్రిష్ణ‌య్య కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్, కార్యదర్శి రవి, బీసీ నాయకురాలు రమ, శివ, నరేష్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page