జూబ్లీహిల్స్ పరిధిలో పర్యటించిన ఎండీ అశోక్‌రెడ్డి
– ఏళ్లనాటి సివరేజ్ పైప్‌లైన్ల వల్ల ఇబ్బందులు
– మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు
– డీ సిల్టింగ్ పనులు పరిశీలన

హైదరాబాద్, సెప్టెంబర్ 03, అద్దం న్యూస్ : జలమండలి ఓ అండ్ ఎం డివిజన్–6 జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి, కృష్ణ నగర్ కాలనీ, శ్రీ నగర్ కాలనీలలోని పలు సమస్యాత్మకమైన ప్రాంతాలను ఎండీ అశోక్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. మొదటగా వెంకటగిరి ప్రాంతంలో వర్షం పడ్డప్పుడు అవుట్ లెట్ సరిగ్గా లేని కారణంగా వర్షం నీరు కాలనీలో నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. దీంతో జలమండలి ఇటీవల వర్షాల తరువాత డీ–సిల్టింగ్ పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించి డీ సిల్టింగ్ పనులు పరిశీలించారు. ఏళ్లనాటి సివరేజ్ పైప్‌లైన్లు, రోడ్డు కింద పూడుకుపోయినట్టు, దీంతో మట్టి, చెత్త చేరి సివరేజ్ సాఫీగా చేరకుండా.. వీధుల్లో ఓవర్ ఫ్లో అవుతున్నట్టు అధికారులు ఎండీకి వివరించారు. దీంతో ఈ ప్రాంతంలో సివరేజ్ పైప్‌లైన్లను డీ సిల్టింగ్ చేసి తాత్కాలికంగా సమస్యలని పరిష్కరించాలని ఎండీ అధికారులను ఆదేశించారు. శాశ్వత పరిష్కారంగా మ్యాన్ హాళ్లను రోడ్డుకు సమాంతరంగా పునర్నిర్మాణం చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించి సీవరేజ్ మాష్టర్ ప్లాన్ ను రూపొందించాలని సూచించారు. అలాగే జీహెచ్ఎంసీ సంబంధించిన వాననీటి కాలువలో సీవరేజ్ నీరు చేరకుండా ప్రతేక సివరేజ్ పైప్‌లైన్లను నిర్మాణం చేపట్టాలని ఈ సందర్బంగా ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే జీహెచ్ఎంసీ వాననీటి కాలువలో డీ సిల్టింగ్ పనులు చేపడితే ఈ సమస్య కొంత మేరకు తీరుతుందని.. ఆ పనులు వెంటనే చేపట్టాలని స్థానిక జీహెచ్ఎంసీ డీసీకి సూచించారు. జలమండలి, జీహెచ్ఎంసీ శాఖల అధికారులు సమస్య పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలనీ ఈ సందర్భంగా ఎండీ కోరారు.

అనంతరం కృష్ణానగర్ కాలనీ ఏ, బీ బ్లాక్, లేబర్ అడ్డా ప్రాంతాలు, రహదారులలో మురుగు పారే ప్రాంతాల్లో పర్యటించి శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలను రూపొందించి, తాత్కాలికంగా సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఎండీ సూచించారు. రహదారులపై ఉన్న తాగునీటి వాల్వ్ చాంబర్లు కొన్ని ప్రాంతాల్లో ధ్వంసమైన విషయం ఈ పర్యటనలో ఎండీ గుర్తించారు. వెంటనే చాంబర్లలో నీరు చేరితే కలుషత నీరు సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున, వెంటనే అలాంటి తాగునీటి వాల్వ్ చాంబర్లు గుర్తించి రోడ్డుకు సమాంతరంగా నిర్మించాలని ఏఏంఎస్ ఏజెన్సీని ఆదేశించారు. తాగునీటి వాల్వ్ చాంబర్ల వద్ద లీకేజీనీ అరికట్టి కలుషిత నీరు సరఫరా కాకుండా నిరోధించాలని అన్నారు. కలుషిత నీరు సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే ప్రాంతంలో పర్యటించిన ఎండీ.. అక్కడ నిరూపయోగంగా ఉన్న చేతి పంపును గుర్తించి, దాన్ని స్పెషల్ డ్రైవ్ లో ఇంజెక్షన్ బోర్ వెల్ గా మార్చాలని ఆదేశించారు. ఇంజెక్షన్ బోర్ వెల్ గా మార్చడానికి ఇలాంటి నిరూపయోగంగా ఉన్న మరిన్ని బోర్ వెల్ లను గుర్తించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీజీఎం ప్రభు, జీఎం ఇతర అధికారులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply