అరుంధతినగర్ బస్తీ అధ్యక్షుడిగా ఎన్నికైన మెరుగు శ్రీనివాస్ యాదవ్

నిస్వార్థ సేవలే మెరుగు శ్రీనివాస్ యాదవ్ గెలుపున‌కు దోహదపడ్డాయి
– అరుంధతినగర్ బస్తీ అధ్యక్షుడిగా తొమ్మిదో సారి ఎన్నికైన మెరుగు శ్రీనివాస్ యాదవ్

హైద‌రాబాద్‌, జూలై 27, ( అద్దం న్యూస్ ) :      బస్తీ ప్రజలకు నిస్వార్థంతో గత 2003 నుంచి అంటే సుమారుగా 23 సంవత్సరాలుగా సేవలందించడమే మరోసారి బస్తీ అధ్యక్షుడిగా మెరుగు శ్రీనివాస్ యాదవ్ ను ఎన్నిక చేయడానికి దోహద పడిందని తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎం నరసయ్య అభిప్రాయపడ్డారు. గాంధీనగర్ డివిజన్ అరుంధతినగర్ బస్తి ఎన్నికలలో తొమ్మిదవ సారి మెరుగు శ్రీనివాస్ యాదవ్‌ను అధ్యక్షుడిగా గెలిపించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ మెరుగు శ్రీనివాస్ యాదవ్ ను అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ… ప్రజలతో మమేకమై అనునిత్యం బ‌స్తీ వాసులకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేస్తున్న శ్రీనివాస్ యాదవ్ సేవలు మరింత విస్తృత పరిచి డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తొమ్మిదో సారి ఎన్నికైన మెరుగు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… అరుంధతినగర్‌లో హోరావోరిగా జరిగిన ఈ ఎన్నికలలో తనకు మద్దతు పలికిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి నగర ఉపాధ్యక్షులు పునిరెడ్డి జైపాల్ రెడ్డి, ఎం.లక్ష్మణ్ , కోశాధికారి సురేష్, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు గుండెల్లి రవీందర్ యాదవ్, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు అజయ్ గౌడ్, బస్తీ వాసులు మీసాల శేషగిరి, సిహెచ్.రాజు, మేకల దాసు, గడ్డం ప్రభాకర్, సత్యనారాయణ, సంపత్, కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page