సాఫ్ట్ బాల్ క్రీడా కారిణి చేపుర్వ ప్రవలిక ను సన్మానించిన ఎమ్మెల్యే పద్మారావుగౌడ్
సికింద్రాబాద్, సెప్టెంబర్ 01, అద్దం న్యూస్ : జాతీయ క్రీడల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సితాఫలమండీ ప్రాంతానికి చెందిన సాఫ్ట్ బాల్ క్రీడా కారిణి చేపుర్వ ప్రవలిక ను సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఘనంగా సత్కరించారు. తాజాగా చైనాలో జరిగిన ఆసియా కప్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ప్రవలిక తెలంగాణా రాష్ట్రం నుంచి భారత దేశ జెట్టులో ప్రాతినిద్యం పొంది తన సత్తాను చాటుకుంది. స్పోర్ట్స్ అధారిటీ అఫ్ తెలంగాణా నుంచి నగదు పారితోషికాన్ని కూడా పొందింది. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ… ప్రవలిక తన సామర్ధ్యంతో తెలంగాణా రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేసిందని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా మరింతగా రాణించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply