మోదీ విధానాలతో విదేశాంగ విధానానికి ప్రమాదం
♦ అమెరికాకు సాగిలపడే చర్యలు
♦ ట్రంప్ విధానాలను కూడా ప్రశ్నించలేని స్థితిలో ఫారీన్ పాలసి
అంబానీ మెప్పుకోసం పరితపిస్తున్న మోదీ – ప్రొఫెసర్ కె.నాగేశ్వర్
♦ ఏచూరి స్ఫూర్తితో యూనివర్శీటీలలో సెక్యులర్ భావాల పెంపు కోసం ఉద్యమించాలి – ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భటాచార్య
హైదరాబాద్, సెప్టెంబర్ 10, అద్దం న్యూస్ : దేశంలో మోదీ విధానంతో విదేశాంగ విధానం ప్రమాదంలో పడిందని, భారత్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం లేకుండా పోయిందని అమెరికా అధ్యక్షుడు బెదిరింపులు చేస్తే బెంబేలెత్తిపోయి, పొగిడితే అమెరికాకు భయపడి అమెరికా ప్రయోజనాల కోసం పనిచేస్తుందని అమెరికా ఆధిపత్యం కొనసాగించడానికి అమెరికా కుట్రలు చేస్తోందని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాజీ ఎంపి, ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షుడు సీతారాం ఏచూరి ప్రథమ వర్థంతి సందర్భంగా అమెరికా ఆధిపత్యం భారత దేశం ఏం చేయాలి అనే అంశంపై స్మారకోపన్యాసం జరిగింది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ…. అమెరికా తన ఆధిపత్యం కొనసాగింపు కోసం దేశాల పై టారిప్స్ విధిస్తుందని, అమెరికా విధించే టారిప్స్ వల్లన మన దేశంలో రైతాంగం, ఆక్వా, పాల రైతులు, లెదర్ తదితర రంగాలపై ప్రభావం ఉంటుందని ఈ చర్యలు నుండి ఉపశమనం కోసం ప్రభుత్వం రాయితీలు ప్రకటించి ఉపశమనం కల్గించాలని అన్నారు. అమెరికా మన దేశ అంతర్గత అంశాలలో కూడా జోక్యం చేసుకుంటుందని మన ఫారీన్ పాలసీ అత్యంత బలహీనంగా ఉందన్నారు. అమెరికన్ సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఏచూరి అదే చేశారని తెలిపారు.
ఎస్ఎఫ్ఐ ఆలిండియా ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భటాచార్య మాట్లాడుతూ… అధ్యయనం, పోరాటం స్ఫూర్తితో సెక్యులర్ విధానం కోసం ఉద్యమించాలన్నారు. మోదీ అమెరికా విధానాలు, విద్యను, విద్యరంగంలో పాలసీలను అమలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన అన్నారు. ఎస్ఎఫ్ఐ పూర్వ రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కోసం విద్యలో అసమానతలు కోసం ఏచూరి స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగించాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ… విద్యార్ధి హక్కుల కోసం నిఖరంగా నిలబడి ఏమర్జెన్సీలో సైతం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ని రాజీనామా చేయాలని అడిగిన ధిశాలి సీతారాం ఏచూరి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు కిరణ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు మమత, కె.శంకర్,శ్రీకాంత్, రంజిత్, ఉపాధ్యక్షులు కిరణ్, అశోక్ రెడ్డి, ప్రశాంత్, బి.శంకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కార్తీక్, టి.ప్రవీణ్, ప్రశాంత్, లెనిన్, జె.రమేష్, ఆది, విఘ్నేష్, భరత్, అజయ్, అభినవ్, సుమలత, ఎల్.రాజు, రాజేష్, రాజు గౌడ్, దిగంబర్, రమ్య, సహాన, అవినాష్, నరేష్, అరవింద్, శ్రీకాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply