చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా ముదిగొండ మురళి
హైదరాబాద్, సెప్టెంబర్ 24, అద్దం న్యూస్ : ఈ నెల 26 న తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా హైదరాబాద్ జిల్లా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ముదిగొండ మురళి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీని ప్రకటించింది. అందులో ముదిగొండ మురళిని కన్వీనర్‌గా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన పై నమ్మకంతో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్‌గా తనను నియమించడం సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో తాను కృషి చేస్తానన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply