i BOMMA రవి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన నాంపల్లి కోర్టు
అద్దం న్యూస్, వెబ్ డెస్క్ : పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మంది రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అతడికి సంబంధించిన 5 బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. అయితే కేసు దర్యాప్తు జరుగుతుందని, రవికి ఇతర దేశాల్లో పౌరసత్వం ఉండడంతో బెయిల్ ఇస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసుల వాదనలను విన్న కోర్టు రవికి చెందిన 5 బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply