2025.. నాకు చాలా ముఖ్యమైన సంవత్సరం: Naga Chaitanya

2025.. నాకు చాలా ముఖ్యమైన సంవత్సరం: Naga Chaitanya

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: గతేడాది తనకెంతో ప్రత్యేకమని నటుడు నాగ చైతన్య (Naga Chaitanya) చెప్పారు. ‘తండేల్‌’తో తన కెరీర్‌ పూర్తిగా మారిపోయిందన్నారు. రూ.100కోట్ల క్లబ్‌లో చేరిన తన తొలి సినిమాగా అది ఎప్పటికీ ప్రత్యేకమన్నారు.

‘‘2025 నాకు చాలా ముఖ్యమైన సంవత్సరం. తండేల్‌ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడమే కాకుండా అది ఓటీటీ డీల్‌లోనూ రికార్డులు సృష్టించింది. నా కెరీర్‌లో థియేటర్‌లో ‘తండేల్‌’, ఓటీటీలో ‘దూత’ ఎంతో మార్పు తెచ్చాయి. ఇప్పుడు నా 25వ చిత్రం ‘వృషకర్మ’తో బిజీగా ఉన్నాను. ఇప్పటివరకూ చేయని కంటెంట్‌తో ప్రేక్షకులను పలకరించనున్నా. ఈ కొత్త సంవత్సరంలో నా లైఫ్‌లో ఎన్నో ఉత్తేజకరమైన పరిణామాలు జరగనున్నాయి. నా కుటుంబంతో కలిసి ఆ క్షణాలను ఆస్వాదించడానికి, నటుడిగా కొత్త కథలను ఎంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కథల ఎంపిక విషయంలోనూ జాగ్రత్త వహిస్తాను’’ అని నాగచైతన్య చెప్పారు.

‘వృషకర్మ’లో వీఎఫ్‌ఎక్స్‌కు అధిక ప్రాధాన్యం ఉందని ఆయన చెప్పారు. తానొక నిధి అన్వేషకుడిగా, గాఢతతో కూడిన పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. పురాణాల్ని, చరిత్రని మేళవించి భారీ హంగులతో రూపొందిస్తున్న చిత్రమిదన్నారు. ‘కస్టడీ’, ‘థాంక్యూ’ సినిమాలతో హిట్‌ కోసం ఎదురుచూసిన నాగచైతన్య.. 2023లో ‘దూత’తో ఓటీటీలోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకున్నారు. గతేడాది ‘తండేల్‌’ కూడా ఆయనకు హిట్‌ను అందించిన విషయం తెలిసిందే.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page