...

ఏపీలోని ఆ రూట్‌లో రైళ్ల సమయాలు మార్పు..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రైళ్లకు సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. నంద్యాల-గుంతకల్లు మధ్య రాత్రిపూట నడుస్తున్న రైళ్ల సమయాలను మార్చే అంశంపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లోక్‌సభలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, అమరావతి ఎక్స్‌ప్రెస్, విజయవాడ-హుబ్బళ్లి రైళ్లు అర్ధరాత్రి బయల్దేరుతున్నాయని తెలిపారు. ఈ కారణండా ఆ రైళ్లలో వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ కోరారు. వాటికి బదులుగా పగటిపూట నడిచే రైళ్లు నడపాలని ఎంపీ కోరారు.

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటనలు చేశారు. నంద్యాల-గుంతకల్లు మధ్య రాత్రిపూట రైళ్ల సమయాలు మార్పు, పగటిపూట నడిచేలా చూడటంపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. గుంతకల్లులో ఐసీఎఫ్ కోచ్‌ల నిర్వహణకు సౌకర్యాలున్నాయని, నంద్యాలలో లేవని, ఈ సమస్య పరిష్కారంపై హామీ ఇచ్చారు. డోన్-దూపాడు-బేతంచెర్ల లైన్ పురోగతిపై కూడా సమాచారం అందిస్తామన్నారు. ఏపీలో 799 ఆర్వోబీలు, ఆర్‌యూబీలు నిర్మించామని, మరో 316 నిర్మాణానికి అనుమతిచ్చామని తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.