Friday, September 18, 2026
HomecinemaAnaganaga Oka Raju Song: మల్లారెడ్డి కోడలితో కలిసి డ్యాన్స్ చేసిన హీరో.. వీడియో వైరల్

Anaganaga Oka Raju Song: మల్లారెడ్డి కోడలితో కలిసి డ్యాన్స్ చేసిన హీరో.. వీడియో వైరల్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty).. 2026 సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju Song) చిత్రంతో అలరించడానికి రెడీ అయ్యారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన ‘భీమవరం బాల్మా’ పాట ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి తాజాగా ‘రాజు గారి పెళ్లిరో’ అనే సెకండ్ సింగిల్ వచ్చేసింది. ఈ పాట లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో నిర్వహించారు.

‘రాజు గారి పెళ్లిరో’ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నవీన్‌ పొలిశెట్టి – మీనాక్షి చౌదరి కలిసి అదే పాటకి డ్యాన్స్ చేసి అలరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డితో కూడా నవీన్ డ్యాన్స్ చేయించారు. ఇటీవల ఓ పాటకు స్టెప్పులేసి తనలోని డ్యాన్సర్‌ను పరిచయం చేసిన ప్రీతిరెడ్డి (Preethi Reddy).. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ పాటకి నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షీ చౌదరిలతో కలిసి డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు.

https://x.com/SitharaEnts/status/2004548282769653827?s=20

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page