...

ఘ‌నంగా మాజీ హోం మంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి వ‌ర్థంతి

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించిన నాయిని

– మాజీ హోం మంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి వ‌ర్థంతిలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మాజీ కార్పొరేట‌ర్ శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబ‌ర్ 22, అద్దం న్యూస్ :     తెలంగాణ ఉద్య‌మంలో నాయిని న‌ర్సింహారెడ్డి కీల‌క‌పాత్ర పోషించార‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్‌, నాయిని న‌ర్సింహారెడ్డి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శ్రీనివాస్‌రెడ్డి లు అన్నారు. తొలి, మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ హోం మంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి వ‌ర్థంతి కార్య‌క్ర‌మం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని వాడ వాడ‌ల్లో బుధ‌వారం ఘ‌నంగా జ‌రిగింది. ఇందులో భాగంగా రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంప‌ల్లి లంబాడి తండా డబుల్ బెడ్ రూమ్ భవనం వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ హోం శాఖ మంత్రి నాయిని వ‌ర్థంతి జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మాల‌కు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్‌, నాయిని న‌ర్సింహారెడ్డి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శ్రీనివాస్‌రెడ్డి లు హాజ‌రై నాయిని నర్సింహారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… పేద ప్రజల కోసం కార్మికుల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. కేసీఆర్‌ నేతృత్వంలో సాగిన తెలంగాణ మహోద్యమంలో నాయిని కీలకభూమిక పోషించారన్నారు. వి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుడు నాయిని నర్సింహారెడ్డి అని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. నాయిని సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయ‌ని అన్నారు. ఆయన ఆశయాల‌ను కొనసాగించాలని పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయిని దేవేందర్ రెడ్డి, రేషం మల్లేష్, సిరిగిరి శ్యామ్, పెంట రెడ్డి, రోషం బాలు, జోగేందర్, శివ, గోపి, కార్తీక్ యాదవ్, శంక‌ర్ ముదిరాజ్‌, ముదిగొండ ముర‌ళీ, సిరిగిరి కిర‌ణ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాంనగర్ చౌరస్తా వద్ద :

రాంనగర్ చౌరస్తా అమరవీరుల స్థూపం వద్ద బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రేషం మల్లేష్, సిరిగిరి శ్యాం కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నాయిని నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం జ‌రిగింది. అదే విధంగా ఇందిరాపార్క్ చౌరస్తాలో కల్వ గోపి ఆధ్వర్యంలో నాయిని నర్సింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముషీరాబాద్ చౌరస్తాలో కార్తీక్ యాదవ్ నాయిని నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్‌, నాయిని న‌ర్సింహారెడ్డి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శ్రీనివాస్‌రెడ్డి హాజరై నాయిని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.



 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.