Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఅరుంధతినగర్ బస్తీలోని పెండింగ్ ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలి 

అరుంధతినగర్ బస్తీలోని పెండింగ్ ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలి 

📰 Generate e-Paper Clip

అరుంధతినగర్ బస్తీలోని పెండింగ్ ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలి 
– జలమండలి ఎండి అశోక్ రెడ్డిని కోరిన మాజీ కార్పొరేటర్ పావని

హైదరాబాద్,  జూన్ 17, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అరుంధతి నగర్ బస్తీలో పెండింగ్ లో ఉన్న ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ ఎ.పావని కోరారు. ఈ మేరకు బుధవారం ఖైరతాబాద్ లోని జలమండలి కార్యాలయంలో సంస్థ ఎండి అశోక్ రెడ్డి ని కలిసి పెండింగ్ పనులపై చర్చించారు. పైప్ లైన్ పనులు పూర్తి అయిన చోట ప్యాచ్ వర్క్ పనులు చేయని కారణంగా బస్తిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె వివరించారు.

ఇటీవల జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డైరెక్టర్ లను కలిసి సమస్యను తెలిపినా స్పందన కరువైందని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. వెంటనే స్పందించిన ఎండి.అశోక్ రెడ్డి పెండింగ్ ప్యాచ్ వర్క్ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను పూర్తి చేయాలని అధికారులకు, ఆదేశాలు జారీ చేశారని మాజీ కార్పొరేటర్ పావని తెలిపారు. ఈ సమీక్షలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page