Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADనూతన మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్లు వేయండి

నూతన మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్లు వేయండి

📰 Generate e-Paper Clip

ఆశీర్వాద్ అపార్ట్‌మెంట్‌ వీధిలో నూతన మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్లు వేయండి
– అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్,  జూన్ 17, ( అద్దం న్యూస్ ) :    బాపూజీనగర్ డివిజన్ ఆశీర్వాద్ అపార్ట్‌మెంట్‌ వీధిలో కలుషిత నీటి సమస్య పరిష్కారం కావాలంటే నూతన మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్లు వేయాలని జలమండలి అధికారులను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశించారు. ముషీరాబాద్ నియోజకవర్గం బాపూజీనగర్ డివిజన్ ఆశీర్వాద్ అపార్ట్‌మెంట్‌ వీధిలో చిలకలగూడ వాటర్ వర్క్స్ డీజీఎం విష్ణువర్ధన్, మేనేజర్ శివ సాయి లతో కలిసి బుధవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరా సరిగ్గా కావడం లేదని, డ్రైనేజీ మ్యాన్ హోళ్ళు పొంగుతున్నాయని స్థానికంగా ఉండే ప్రజలు, మహిళలు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో వాపోయారు. వర్షం వచ్చిన ప్రతిసారి వరద నీటి తాకిడికి ఎవరో ఒకరు మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ… ఆశీర్వాద్ అపార్ట్‌మెంట్‌ చుట్టు పక్కల ప్రాంతంలో చాలా రోజులుగా మంచినీటి, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయన్నారు. ఇదే ప్రాంతంలో పాదయాత్రలు చేసి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదన్నారు. పైప్‌లైన్ల కోసం పలుమార్లు ప్రతిపాదనలు ఇచ్చినా పై అధికారులు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేద‌న్నారు. స్థానికంగా డ్రైనేజీ మ్యాన్ హోళ్ళు పొంగడం వల్ల మంచినీటి సరఫరాలో కలుషిత నీరు వస్తుందని, దాని వల్ల స్థానికులు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా నూతన మంచినీటి, డ్రైనేజీ పైప్‌లైన్లు వేయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయ సింహ, శ్రీధర్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, గొర్ల నాగులు యాదవ్. ఎయిర్‌టెల్ రాజు, మల్లి, డేగల బిక్షపతి యాదవ్, బలవంత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page