Home AP పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ఛైర్‌ప‌ర్స‌న్‌ జగదాంబ మృతి

పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ఛైర్‌ప‌ర్స‌న్‌ జగదాంబ మృతి

0
1

పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ఛైర్‌ప‌ర్స‌న్‌ జగదాంబ మృతి

హైదరాబాద్, డిసెంబ‌ర్ 18, అద్దం న్యూస్ :   పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ఛైర్‌ప‌ర్స‌న్‌ హెచ్ఎ ఎకె.జగదాంబ (87) అనారోగ్యంతో గురువారం తెల్ల‌వారుజామున‌ మృతి చెందారు. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న జగ‌దాంబ హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ రాంన‌గ‌ర్ గుండు ఉండే త‌న నివాసంలో మృతి చెందారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కృష్ణా జిల్లా బంద‌రులో 1938లో జ‌న్మించిన జ‌గ‌దాంబ హైద‌రాబాద్‌కు వ‌చ్చి స్థిర‌ప‌డ్డారు. జాతీయ జెండాను సృష్టిక‌ర్త పింగ‌లి వెంక‌య్య పేరుతో ట్ర‌స్ట్‌ను ఏర్పాటు చేసి అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. పింగ‌ళి వెంక‌య్య‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. 2009లో పింగళి వెంకయ్య గౌరవార్థం కేంద్ర ప్రభుత్వంచే రూ.5 తపాలా బిళ్లను విడుదల చేయించడంలో ఆమె ఎన‌లేని కృషి చేశారు. గురువారం సాయంత్రం బ‌న్సిలాల్‌పేట స్మ‌శాన వాటిక‌లో జ‌గ‌దాంబ అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. విష‌యం తెలుసుకున్న మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ ప్ర‌గాఢ సంతాపాన్ని తెలియ‌చేశారు. అలాగే అన్ని పార్టీల నాయ‌కులు జ‌గ‌దాంబ అంత్య‌క్రియ‌ల్లో పాల్లొని నివాళుల‌ర్పించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page