గాంధీనగర్‌లో ప్రధాన మంత్రి 130 వ మన్ కి బాత్
హైదరాబాద్, జనవరి 25, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్ స్ట్రీట్ నెం 4 లో ఆదివారం ప్రధాన మంత్రి మన్ కి బాత్ 130 వ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బిజెపి నాయకులతో కలిసి మన్ కి బాత్ ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమం అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ… మన్ కి బాత్ ద్వారా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఆలోచింప చేసే అనేక అంశాలను చర్చకు పెట్టి, అందులో వారినీ భాగస్వాములను చేయండం మనం చూస్తున్నామన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని మోడీ పిలుపునిచ్చారన్నారు. అందరూ ఆరోగ్య పరమైన జీవితాలను కొనసాగించేందుకు చిరు ధాన్యాలతో కూడిన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని లక్ష్మణ్ అన్నారు. తదుపరి 131 వ మన్ కి బాత్ కార్యక్రమంలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ( AI ) గురించి చర్చిస్తానని మోడీ అన్నారని కావున నేటి ఆధునిక యువత తప్పకుండా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, కోవా రాహుల్, డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, సురేష్ రాజు, కాలనీ వాసులు స్వామి రావు, రాజేష్, రామ్ రెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్, రామ్ కోటేశ్వర్, పలువురు బిజెపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.














Leave a Reply