Wednesday, October 28, 2026
No menu items!
HomeGREATER HYDERABADమ‌లిద‌శ ఉద్య‌మకారుడు దివంగ‌త లింగాల కేదారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించండి – అధికారుల‌కు సీఎం...

మ‌లిద‌శ ఉద్య‌మకారుడు దివంగ‌త లింగాల కేదారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించండి – అధికారుల‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 21, ( అద్దం న్యూస్ ) :    తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ( CMRF ) నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో లింగాల కేదారి, పుష్పలత అంకితభావంతో అందించిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. కేదారి దంపతులు ఒక సాధారణ హోటల్ నడుపుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, వృథా చేయకూడదని అవగాహన కల్పిస్తూ, సమాజం పట్ల ఎంతో బాధ్యతగా నడుచుకున్నారు. ఉద్యమ సమయంలో వీరు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీలు అందించారు. హనుమకొండలోని శాంతినగర్ పోస్టల్ కాలనీకి చెందిన లింగాల కేదారి ఈ నెల 9 న, ఆయన భార్య పుష్పలత ఈ నెల 10న విషాదకర సంఘటనలో మృతి చెందారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి CMRF నుంచి సీఎం ఓఎస్డీ రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. మంజూరైన ఆర్థిక సాయాన్ని అర్హులైన చట్టబద్ధ వారసులు, కుటుంబ సభ్యులకు అందించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ను ఆదేశించారు. 

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page