అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించాలి
– ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, సెప్టెంబర్ 10, అద్దం న్యూస్ : అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించాలని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ చిక్కడపల్లిలోని సోప్ ఫ్యాక్టరీ వీధిలో నూతనంగా కొనసాగుతున్న సిసి రోడ్డు పనులను బుధవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… సోప్ ఫ్యాక్టరీలో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులు పూర్తయ్యాక స్థానికుల సమస్య తీరనుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లల్లో రోడ్లను వేయిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జయసింహ, బిఆర్ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, నాయకులు గోక నవీన్, ఆర్.వివేక్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, గోపి, కృష్ణ, సాయి చాణిక్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
















Leave a Reply