బంగారం, వెండి ధరల పెరుగుదల నేరాల పెరుగుదలకు దారితీస్తోంది
» తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ది సౌత్ ఇండియా టైమ్స్ ప్రతినిధి డాక్టర్. తనుగుల జితేందర్ రావు
హైదరాబాద్, డిసెంబర్ 26, అద్దం న్యూస్ : బంగారం, వెండి ధరలు నిరంతరంగా పెరుగుతున్న తీరును సమాజంలో పెరుగుతున్న ఒత్తిడితో పోల్చుతూ, పెరుగుతున్న ఆర్థిక భారం కారణంగా నేరాల రేటు కూడా పెరుగుతోందని తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ది సౌత్ ఇండియా టైమ్స్ ప్రతినిధి డాక్టర్. తనుగుల జితేందర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరగడం వంటివి సమాజంలోని బలహీన వర్గాలను నేర కార్యకలాపాల వైపు నెట్టుతున్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక అవసరాలు అందుబాటులో లేకపోవడం, ఉద్యోగ అవకాశాలు కొరతగా ఉండడం వల్ల ముఖ్యంగా యువతలో పెరిగే నిరాశ దొంగతనాలు, సైబర్ నేరాలు తదితర అక్రమాలకు దారితీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. 












Leave a Reply