పార్సిగుట్ట ఈస్ట్ మున్సిపల్ కాలనీలో మంచినీటి సరఫరా సమస్యను పరిష్కరించండి
– ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, డిసెంబర్ 23, అద్దం న్యూస్ : పార్సిగుట్ట ఈస్ట్ మున్సిపల్ కాలనీలో మంచినీటి సరఫరా సమస్యను పరిష్కరించండని వాటర్ వర్క్స్ అధికారులను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశించారు. మంగళవారం ముషీరాబాద్ డివిజన్ ది పార్శిగుట్ట ఈస్ట్ మున్సిపల్ కాలనీ రెసెడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వాటర్ వర్క్స్ డిజిఎం మోహన్ రాజ్, జిహెచ్ఎంసి డిఈ గీత, ఏఈ మురళీ, వాటర్ వర్క్స్ మేనేజర్ శివసాయి, ఎలక్ట్రికల్ ఏఈ రోచిత లతో ఎమ్మెల్యే ముఠా గోపాల్ కాలనీలో పర్యటించారు. మా కాలనీలో గత కొద్ది నెలలుగా మంచినీటి సరఫరా సాయంత్రం 5 నుంచి ప్రారంభమై రెండు గంటల పాటు అవుతుందని, దీని వల్ల అసౌకర్యంగా ఉందని స్థానిక కాలనీవాసులు ఎమ్మెల్యేతో పాటు అధికారులకు వినతి పత్రాన్ని అందచేశారు. సాయంత్రం విధుల నుంచి వచ్చలోపే నీటి సరఫరా బంద్ అవుతుందని, సరఫరాలో ప్రెషర్ కూడా తక్కువ సేపు వస్తుందని వాపోయారు. మంచినీటి సరఫరా సమయాన్ని రాత్రి 8 గంటలకు మార్చాలన్నారు. అలాగే కాలనీలో గంజాయి తాగి పోకిరీలు నానా రభస చేస్తున్నారని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్పందిస్తూ మంచినీటి సరఫరాలో కాలనీవాసులకనుగుణంగా సమయాన్ని మార్చాలని, సరఫరాలో ప్రెషర్‌ను పెంచాలని అధికారులను ఆదేశించారు. పోకిరీల బెడద లేకుండా సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడుతానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్శిగుట్ట ఈస్ట్ మున్సిపల్ కాలనీ రెసెడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్‌గౌడ్, యాదగిరి, ఉపాధ్యక్షులు ప్రేమలతారెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు జైసింహా, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొండా శ్రీధర్‌రెడ్డి, ఆకుల అరుణ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభాకర్, కాలనీవాసులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply