విజయ్ పాల్, అశ్విన్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ రామ కల్యాణం
హైదరాబాద్, మార్చి 26, అద్దం న్యూస్ : శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని అఖండ భారత్ సేన అధ్యక్షుడు విజయ్ పాల్, అశ్విన్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం శ్రీ రామ కల్యాణాన్ని ఘనంగా జరిగింది. గత 6 రోజుల నుండి రామ్ కథ అంజలి ఆర్య నిర్వహించారు. రాముల వారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సాయంత్రం 300 మంది యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాముల వారి శోభాయత్రను భక్తుల కోలాహల మధ్య బ్యాండ్ బాజాలతో ప్రారంభించారు. ఈ యాత్రను కుదిబిగూడ నుండి ప్రారంభమై చెప్పూల్ బజార్, లింగంపల్లి చౌరస్తా, కాచిగూడ చౌరస్తా ఆర్య సమాజం సుల్తాన్ బజార్ చేరుకుంది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ధరం పాల్ సత్య పాల్, విజయ్ పాల్, అశ్విన్ యాధవ్, అజయ్ పాల్, యష్ పాల్, అభినవ్ మిత్ర తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply