హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : అక్షరాలతో అగ్గి రవ్వలు పుట్టించి, చందస్సు సంకెళ్లను తెంచేసి, ఆధునిక కవిత్వానికి అంటుగట్టిన ప్రజాకవి శ్రీ శ్రీ అని పలువురు వక్తలు అన్నారు. బుధవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రం టిపిఎస్‌కె హాల్‌లో శ్రీ శ్రీ 115వ జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ శ్రీ చిత్రపటాలను పట్టుకుని శ్రీ శ్రీ కవిత్వం వర్థిల్లాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లల బాలకృష్ణ, టిపిఎస్‌కె హైదరాబాద్ సెంట్రల్ సిటీ కన్వీనర్ జి.నరేష్, టిపిఎస్‌కె నాయకులు విజయ్ కుమార్, కవి పొన్నం రాజయ్య గౌడ్, యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply