ట్రాన్స్ జెండర్, హిజ్రాల హక్కులు.. బాధ్యతల పై ఈ నెల 7 న రాష్ట్ర సదస్సు
హైదరాబాద్, అక్టోబర్ 4, అద్దం న్యూస్ : ట్రాన్స్ జెండర్లు ప్రజలతో మమేకంగా కావాలని, ట్రాన్స్ జెండర్ల సమస్యలను హక్కులను ప్రభుత్వాలకు అర్థం చేయించాలని, హక్కుల కోసం పోరాడుతూనే ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలని భయం, బాధ్యత రెండిటి పై అవగాహన కోసం ఈ నెల 7 వ తేదీన హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ట్రాన్స్ జెండర్లు, హిజ్రాలు రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నట్లు అల్ ఇండియా ట్రాన్స్ జెండర్ల యాక్టివిస్టి రచన ముద్రబోయిన తెలిపారు. శనివారం సుందరయ్య విజ్ఞానకేంద్రం టిపిఎస్‌కె లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రచన మాట్లాడుతూ… ఈ నెల 7న జరుగనున్న రాష్ట్ర సదస్సుకు తెలంగాణలోని హిజ్రాలు, ట్రాన్స్ జెండర్లు, వారి గురువులు హాజరవుతారని తెలిపారు. సాధించిన హక్కులు.. ప్రజల పట్ల బాధ్యత పై అవగాహన తదితర అంశాలపై ఈ హిజ్రాలు, ట్రాన్స్ జెండర్ల సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ హిజ్రా, ట్రాన్స్ జెండర్ల అసోసియేషన్ అధ్యక్షురాలు మోనాలిసా మాట్లాడుతూ… హిజ్రాలు, ట్రాన్స్ జెండర్లు అంటే అడుక్కోవడం… వ్యభిచారం చేయడం కాదన్నారు. మమ్మల్ని మనుషుల్లా గుర్తించండని కోరారు. హిజ్రాల కోసం కమ్యూనిటీహాల్స్ నిర్మించాలని, తెలంగాణ ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ రైట్స్ వెంటనే అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply