హైదరాబాద్, నవంబర్ 13, అద్దం న్యూస్ : గాంధీ ఆసుపత్రి బస్ స్టాప్ వద్ద ఆటోలను ఆపకుండా చూడాలని చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసులను ముషీరాబాద్ ఆర్టీసి డిపో మేనేజర్ రఘు కోరారు. ఈ మేరకు ఆయన ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ ఆర్టీసి డిపో మేనేజర్ రఘు మాట్లాడుతూ… గాంధీ ఆసుపత్రి వద్ద బస్ స్టాప్‌లో ఆటోలను ఆపుతున్నారని, దీని వల్ల బస్సు ఎక్కేందుకు వచ్చే ప్రయాణికులకు, బస్సులను ఆపేందుకు డ్రైవర్లు ఇబ్బందులుపడుతున్నారన్నారు. ఆర్టీసి ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్ స్టాప్ అక్రమంగా ఆటోలను నిలపడం నిబంధనలకు విరుద్ధమన్నారు. బస్ స్టాప్‌లో ఆటోలను నిలపకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్ రఘు కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply