...

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, విద్యార్ధులను, ఉద్యమకారులను ఆదుకోండి – టిపిసిసి అధ్య‌క్షుడు మ‌హేష్‌కుమార్ గౌడ్‌కు తెలంగాణ ఉద్య‌మ‌కారుల విన‌తి

హైదరాబాద్, జూన్ 21, అద్దం న్యూస్ :     తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, విద్యార్ధులను, ఉద్యమకారులను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ఛైర్మ‌న్ సుల్తాన్ యాద‌గిరి, సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్ తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డిలు కోరారు. ఈ మేర‌కు వారు శ‌నివారం టిపిసిసి అధ్య‌క్షుడు మ‌హేష్‌కుమార్ గౌడ్‌ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ… ప్ర‌త్యేక రాష్ట్రం కోసం తెలంగాణ‌లోని అన్ని వ‌ర్గాల వారు ఉద్యమంలో పాల్గొన్నార‌న్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, కళాకారులను, విద్యార్ధులను, ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. ఉద్య‌మ‌కారుల పై ఉన్న కేసుల‌ను ఎత్తివేయాల‌ని, 250 గ‌జాల స్థ‌లాన్ని ఇవ్వాల‌ని, 30 వేల రూపాయ‌ల పెన్ష‌న్ ఇవ్వాల‌ని, హెల్త్ కార్డులివ్వాల‌ని, ఉచిత బ‌స్ పాస్ ఇవ్వాల‌ని, 100 ఎక‌రాల్లో స్మృతివ‌నం నిర్మించాల‌ని, స‌బ్సిడీతో ఉన్న రుణాలు ఇవ్వాల‌ని, అన్ని రంగాల్లో 3 శాతం రిజ‌ర్వేషన్లు క‌ల్పించేలా ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లాల‌ని మ‌హేష్ కుమార్ గౌడ్‌ను కోరామ‌న్నారు. టిపిసిసి అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్‌ను క‌లిసిన వారిలో తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి వైస్ ఛైర్మ‌న్ పి.తుల్జా రెడ్డి, ఏవి రావు, శంక‌ర్ రావు, ప్ర‌వీణ్‌, ప్ర‌సాద్‌, అంజ‌లి, లావ‌ణ్య‌, సుజి, సుచ‌రిత‌, క‌మ‌ల‌మ్మ‌, ల‌లిత త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.