Suriya: అభిమాని పెళ్లికి అతిథిగా సూర్య.. వధువు రియాక్షన్ వైరల్!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ తన నిరాడంబరత్వంతో అభిమానుల మనసు గెలుచుకుంటున్నారు. తాజాగా అరవింద్ అనే అభిమాని వివాహ వేడుకకు సడన్‌గా హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. ఈ ఊహించని పరిణామంతో వధువు కాజల్ ఆశ్చర్యపోయిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వధువు కాజల్‌కు సూర్య (Suriya) అంటే ఎనలేని అభిమానం. ఆమెకు తెలియకుండానే, వరుడు అరవింద్ హీరో సూర్యను తమ పెళ్లికి ఆహ్వానించారు. పెళ్లి జరుగుతుండగా, తెలుపు రంగు వస్త్రాల్లో, కూలింగ్ గ్లాసెస్ ధరించి సూర్య చాలా సింపుల్‌గా వేదికపైకి వచ్చారు. తన అభిమాన హీరోను కళ్లముందు చూసిన కాజల్, అది నిజమా కలనా అని నమ్మలేక నోరెళ్లబెట్టి చూస్తూ ఆనందంతో ఎమోషనల్ అయ్యారు.

సూర్య (Suriya) స్వయంగా వధూవరుల చేతులు పట్టుకుని, వారికి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అభిమాని కోరిక మేరకు పెళ్లికి వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చిన సూర్య గొప్ప మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వధువు ఎక్స్‌ప్రెషన్స్‌తో కూడిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page