T20 World Cup Tickets: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. రూ. 100 కే వరల్డ్ కప్ టికెట్లు..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది టీ-20 ప్రపంచ కప్‌కు భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లకు సంబంధించి.. టికెట్ సేల్స్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ గురువారమే ప్రారంభించింది. ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది ఐసీసీ. కనీసం రూ. 100 నుంచే టికెట్ ధరల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మ్యాచ్‌ల ప్రాముఖ్యతను బట్టి టికెట్ ధరల్ని ఐసీసీ నిర్ణయించింది. బుక్ మై షో ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు.

వరల్డ్ కప్ మ్యాచ్‌ల టికెట్ ధరల్ని.. చారిత్రక కనిష్ఠ స్థాయిలకు చేర్చింది. కనీసం రూ. 100 నుంచే ఈ మ్యాచ్‌ల్ని చూసే వీలు కల్పిస్తోంది. డిసెంబర్ 11 (గురువారం) సాయంత్రం 6.45 గంటల నుంచి టికెట్ సేల్స్ ప్రారంభమైనట్లు ఐసీసీ వెల్లడించింది. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చే ఈ వరల్డ్ కప్ 2026, ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. ఫేజ్-1 టికెట్ విక్రయాల్ని ప్రారంభించింది.

టికెట్లను బుక్ చేసుకోవాలనుకునే వారిు.. tickets.cricketworldcup.com వెబ్‌సై‌ట్‌కు వెళ్లి.. అక్కడ మీరు 20 జట్లలో ఒక టీమ్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అది బుక్ మై షోకు రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు మ్యాచ్‌ల వివరాలు.. టికెట్ ధరలు తెలుసుకోవచ్చు. వేదికను సెలక్ట్ చేసుకొని కూడా ఇక్కడ వివరాలు చూడొచ్చు. అయితే అన్ని మ్యాచ్‌లకు.. అన్ని వేదికల్లో టికెట్లు ఒకేలా ఉండవు. లీగ్ దశలోనే కనీసం రూ. 100 ధరలు ఉన్నాయి. సూపర్-8 స్టేజ్‌కు ధరలు కాస్త పెరుగుతాయి. భారత్ ఆడే మ్యాచ్‌లకు లీగ్ దశలోనూ కాస్త ధరలు ఎక్కువతోనే ప్రారంభం అవుతున్నాయి. ఇవి కనీసం రూ. 300, రూ. 500, రూ. 750 ఇలా ప్రారంభమవుతున్నాయి.

భారత్‌లో కనీసం రూ. 100 నుంచి అందుబాటులో ఉండగా.. శ్రీలంక కరెన్సీలో LKR 1000 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇది భారత కరెన్సీలో కనీసం రూ. 292 గా చెప్పొచ్చు. ఈసారి టీ-20 వరల్డ్ కప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. కొలంబోలో పాకిస్థాన్- నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తొలి రోజే వెస్టిండీస్- బంగ్లాదేశ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో తలపడనుండగా.. ముంబై వాంఖడే స్టేడియంలో యూఎస్ఏ.. టీమిండియా తన పోరును ప్రారంభించనుంది. మార్చి 8న ఫైనల్ జరగనుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page