కాత్యాయని దేవి రూపంలో ఉన్న అమ్మ‌వారికి టిడిపి నాయ‌కుల పూజ‌లు

కాత్యాయని దేవి రూపంలో ఉన్న అమ్మ‌వారికి టిడిపి నాయ‌కుల పూజ‌లు

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 26, అద్దం న్యూస్ :    దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలో నేతాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారికి విశేష పూజలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారిని కాత్యాయని దేవి రూపంలో అలంకరించారు. నేతాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరు కృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పలుస బాలరాజ్ గౌడ్ ల అధ్యక్షతన జ‌రిగిన ఈ పూజలకు తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు, మాజీ చైర్మన్ పిన్నమనేని సాయిబాబా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సాయిబాబాతో పాటు టిడిపి నగర నాయకులు నల్లెల కిషోర్, నాగు నాగేష్, కిరణ్ కుమార్, ప్రకాష్ ల‌ను నిర్వాహ‌కులు స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో నేతాజి ఫ్రెండ్స్ అసోసియేష‌న్ క‌మిటీ స‌భ్యులు చంద్రమోహన్ గౌడ్, ఉదయ్ కుమార్ గుప్తా, యాదగిరి, అప్పు, శివకృష్ణ, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page