వీర జవాన్ తెలుగు తేజం మూడవత్ మురళీ నాయక్ కు టిడిపి నివాళులు
హైదరాబాద్, మే 10, అద్దం న్యూస్ : భారత్ – పాక్ మధ్య జరుగుతున్న యుద్దంలో ఆంధ్రప్రదేవ్‌కు చెందిన తెలుగు తేజం మూడవత్ మురళీ నాయక్ యుద్దభూమిలో వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో వీర జవాన్ మురళీనాయక్ కు నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హాజరై మురళీ నాయక్‌కు పూలమాలలేసి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. మురళీ నాయక అమరహే అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ… మురళీ నాయక్ పాక్ మూకలపై కడవరకు విరోచితంగా పోరాడుతూ తీవ్రంగా గాయపడ్డారన్నారు. గాయపడినప్పటికీ ఐదుగురు శత్రువులను హత మార్చి విరోచితంగా పోరాడి అమరుడయ్యాడయ్యారన్నారు. ఈ యుద్ధ సంయమనంలో వ్యవహరించాల్సింది పోయి కొన్ని పత్రికలు, టివి ఛానళ్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయెన్సర్‌లు దేశానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ, దేశాన్ని కించపరుస్తూ, పరోక్షంగా శత్రు దేశానికి వంత పాడుతున్నారని విమర్శించారు. ఇటువంటి వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖకు సాయిబాబా విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఒకడు మాట్లాడుతూ… కంటికి కన్ను అనుకుంటూ మాట్లాడాడు… కేవలం మాట్లాడటం కాదు యుద్ధ భూమిలో శత్రు దేశంతో యుద్ధం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల కిషోర్, పి.బాలరాజు గౌడ్, టిడిపి నాయకులు రాజేంద్రప్రసాద్ (ఆర్.పి), పరశురామ్, ఎస్.ప్రకాష్, అడ్డగుట్ట విజయ్, భానుప్రకాష్, జగదీష్ గౌడ్, కిరణ్, మల్లికార్జున్, రవి, కృష్ణస్వామి, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply