తెలంగాణ దళిత ఐక్య వేదిక దసరా మిలాప్ ఆహ్వాన బ్యానర్స్ ఆవిష్కరణ
హైదరాబాద్, అక్టోబర్ 10, అద్దం న్యూస్ :
తెలంగాణ రాష్ట్ర దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 12 వ తేదీన రాంనగర్ ఎస్ఆర్‌టి కమ్యూనిటీహాల్‌లో నిర్వహించనున్న దసరా మిలాప్ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, బ్యానర్స్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ ఎస్ఆర్‌టి కమ్యూనిటీహాల్ ప్రాంగణంలో బ్యానర్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐక్య వేదిక మీడియా కన్వీనర్ గజ్జల సూర్యనారాయణ, కేశపురం స్వామి, గండి కృష్ణ, వివేక్, ఐక్య వేదిక ముషీరాబాద్ అధ్యక్షుడు జివై.గిరి, గడ్డం నవీన్, ఎం.భాస్కర్, గోపాల్ దాస్, నవీన్, ఎర్రోళ్ల సతీష్, హరీష్, జి.నరేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈ నెల 12 వ తేదీన జరుగనున్న దసరా మిలాప్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని దళితులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ దసరా మిలాప్ కార్యక్రమంతో దళితుల ఐక్యతను చాటి చెప్పాలన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply