జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేప‌ధ్యంలో తెలంగాణ ఉద్య‌మ‌కారుల ఫ‌స్ట్ లిస్ట్ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేప‌ధ్యంలో

తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి ఫ‌స్ట్ లిస్ట్ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న


హైదరాబాద్, అక్టోబ‌ర్ 18, అద్దం న్యూస్ :    జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి తొలి లిస్ట్‌ను ప్ర‌క‌టించింది. శ‌నివారం హైద‌రాబాద్ చిక్క‌డ‌ప‌ల్లిలోని టియు జేఏసి సెంట్ర‌ల్ కార్యాల‌యంలో రాష్ట్ర స‌మావేశం జ‌రిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికలు, తెలంగాణ ఉద్యమకారుల పోటీ, ఎన్నికల రాజకీయ అంశాల పై చ‌ర్చించారు. తెలంగాణ ఉద్య‌మ‌కారుల జేఏసి అధ్య‌క్షుడు తుమ్మ‌ల ప్ర‌ఫుల్ రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రన్న ప్రసాద్ లు మాట్లాడుతూ… ఉప ఎన్నిక‌లో పోటీ ఉద్య‌మ‌కారులు పోటీ చేస్తున్న‌ట్లు జేఏసి స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగా 21 మంది అభ్య‌ర్థుల‌తో తొలి విడ‌తను ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే మ‌రి కొంత అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

టియు జేఏసి తొలి విడత పోటీ చేసే అభ్యర్థులు వీరే :

బోయపల్లి రంగారెడ్డి, ఎం.శంకర్ రావు, ఏ,హరి ప్రసాద్, ఓగిరాల సుజి, అంజలి కుమారి, సుచరిత, బాకారం లావణ్య, బాల లక్ష్మి, మాధవి, సూర్య కళ, అనిత, ధనలక్ష్మి, స్వరూప, బి,ఆర్.హరికృష్ణ, జి.రవి, పి.రాము, కె. సాయిలు, యాదగిరి, బి.రాజు, ప్రవీణ్ కుమార్, హర్ ప్రీత్ సింగ్ త‌దిత‌రులు ఉప ఎన్నిక‌లో పోటీ చేయ‌నున్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page