తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలను వాయిదా వేయాలి
– కెడి.రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డిల అవినీతిపై చర్యలు తీసుకోవాలి
– అడిషనల్ లేబర్ కమిషనర్‌కు తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 26, అద్దం న్యూస్ : తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలను వాయిదా వేయాలని, కెడి.రాజు, వెల్లంకి శ్రీనివాస్, నరసింహారెడ్డిల అవినీతిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) రాష్ట్ర కమిటీ కోరింది. తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్‌లో అధ్యక్షుడు వెల్లంకి శ్రీనివాస్, కార్యదర్శి కెడి.రాజు, కోశాధికారి నరసింహారెడ్డి లు కలిసి యూనియన్ లో సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఏకపక్ష నిర్ణయాలతో తమ ఇష్టం వచ్చినట్లు నియంత్ర వ్యవహరిస్తున్నారని.. వీరు పైన విచారణ జరిపించి ఈ నెల 28 తేదీన జరగనున్న తెలుగు సినీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎలక్షన్లను వాయిదా వేయాలని కోరుతూ శుక్రవారం అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ ను కలిసి తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) రాష్ట్ర కమిటీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సినిమా వేదిక ( టివిసి ) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు లారా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్ బైరాగి లు మాట్లాడుతూ… యూనియన్‌లో ఆర్టిస్టులు కానీ వారికి దొంగ చాటుగా 30 వేల సభ్యత్వాలు ఇచ్చారని, నిజమైన సభ్యత్వం ఉన్న ఆర్టిస్టుల కంటే 600 మందికి దొంగ సభ్యత్వాలు ఇచ్చారన్నారు. దొంగ సభ్యత్వాలు తీసుకున్న వారికి చిత్రపురి కాలనీలో ప్లాట్లు ఇస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. వల్లభనేని అనిల్, అంబిరాజు తదితల మద్దతుతో సభ్యత్వాల పేరుతో యూనియన్ అధ్యక్షుడు వెల్లంకి శ్రీనివాస్, కార్యదర్శి కెడి.రాజు, కోశాధికారి నరసింహారెడ్డి లు అక్రమ పద్ధతిలో డబ్బులు వసూలు చేసి ఆంధ్ర ఎన్నికల్లో బెట్టింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.
ఇది పద్ధతి కాదని చెప్పినందుకు దాదాపు 30 మంది నిజమైన ఆర్టిస్టుల సభ్యత్వాలను తొలగించారని విమర్శించారు. కొంతమంది యూనియన్ సభ్యులను అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి పోలీసులతో దాడులు చేయించారన్నారు. లేబర్ యాక్ట్ ప్రకారం మూడు నెలల ముందు జనరల్ బాడీ మీటింగ్ జరిపి యాంకర్ నిర్వహించాలని.. కానీ అలా కాకుండా 2025 సెప్టెంబర్ 7వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ పెట్టి వెంటనే సెప్టెంబర్ 28 వ తేదీన ఎన్నికలను నిర్వహించనున్నారన్నారు.
తప్పుడు పద్ధతిలో ఎన్నికలు జరపవద్దని అని అంటే మా ఇష్టం మేము ఇలాగే చేస్తామంటూ తిడుతున్నారన్నారు. దాదాపు పది సంవత్సరాలుగా యూనియన్‌లో సభ్యత్వాల డబ్బు ఎంత వచ్చింది.. రెన్యువల్ డబ్బులు వాటి వివరాలు ఎంత అనేది ఇప్పటి వరకు చెప్పడంలేదన్నారు. అడిగిన వారి పైన దౌర్జన్యాలు చేస్తున్నారని.. మా వెనుక గంజాయి బ్యాచ్ ఉందని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తెలుగు డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్‌లో వెల్లంకి శ్రీనివాస్, కెడి.రాజు, నరసింహారెడ్డి ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు. వెంటనే జోక్యం చేసుకొని ఈనెల 28 వ తేదీన జరిగే ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. తెలుగు డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్‌లో వెల్లంకి శ్రీనివాస్, కెడి. రాజు, నరసింహారెడ్డి ల పై ఉన్న దొంగ సభ్యత్వాలు… డబ్బుల లెక్కల తారుమారు చేశారనే ఆరోపణల పైన విచారించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమా వేదిక ( టిసివి ) రాష్ట్ర నాయకులు గోవిందరాజ్, కుమార్, కెసిఎస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply