కోటి రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలి
– మంత్రిని కోరిన గాంధీనగర్ కార్పొరేటర్ పావని
హైదరాబాద్, డిసెంబర్ 31, అద్దం న్యూస్ : గాంధీనగర్ డివిజన్ అభివృద్ధి పనుల కొరకు కేటాయించిన కోటి రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కోరారు. ఈ మేరకు బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను గాంధీనగర్ కార్పొరేటర్ పావని కలిసి వినతి పత్రాన్ని అందచేశారు. గాంధీనగర్ డివిజన్‌లో కావలిసిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల అభివృద్ధి కొరకు కేటాయించిన 1 కోటి రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని పావని కోరారు. జిహెచ్ఎంసి నుండి మంజూరు కావలిసిన మరో 1 కోటి రూపాయల నిధులను డివిజన్ల అభివృద్ధి కొరకు మంజూరు చేసి పనులను పూర్తి చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసి డివిజన్ అభివృద్ధి పనులకు సహకరించాలని మంత్రిని కోరామని కార్పొరేటర్ పావని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మరో వారం రోజుల్లో నిధులు కేటాయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కార్పొరేటర్ పావని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.















Leave a Reply