భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ‘ ధనిక్ భారత్ ’ లక్ష్యం
▪️ లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణ రావు
▪️ 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ కోర్సుల ప్రారంభం
▪️ భారత్‌ను విశ్వగురు చేసే ప్రయత్నంగా ‘ధనిక్ భారత్’
▪️ దేశంలోనే తొలిసారి మోడ్రన్ – స్మార్ట్ లెర్నింగ్ విధానం
▪️ దేశం గర్వించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతాం – డైరెక్టర్ బాలలత
▪️ ఆరోగ్య రంగం తర్వాత విద్యారంగంలోకి అడుగుపెట్టిన లాయిడ్ గ్రూప్
హైదరాబాద్, జనవరి 22, అద్దం న్యూస్ : దేశ ఆరోగ్య రంగంలో నాణ్యత, విశ్వసనీయతతో ప్రత్యేక గుర్తింపు సాధించిన లాయిడ్ గ్రూప్ ( Lloyd Group ) విద్యారంగంలోకి ఘనంగా అడుగుపెట్టింది. భావి భారత పౌరులను విలువలతో కూడిన, ప్రపంచ స్థాయి విద్యతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘ ధనిక్ భారత్ అకాడమీ ’ని 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణ రావు, ధనిక్ భారత్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు, బోర్డు డైరెక్టర్లు పాల్గొని అకాడమీ లక్ష్యాలు, బోధనా విధానం, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా లాయిడ్ గ్రూప్ ( Lloyd Group ) అధినేత విక్రమ్ నారాయణ రావు మాట్లాడుతూ…మూడు, నాలుగు దశాబ్దాలుగా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అనే మాటనే వింటున్నామన్నారు. 46 ఏళ్ల తర్వాత కూడా అదే పదం వినిపిస్తోందని, ఇకనైనా ‘ భారత్ అభివృద్ధి చెందిన దేశం ’ అని ప్రపంచానికి నిరూపించాల్సిన అవసరం ఉందని.. ఆ ఆలోచన నుంచే ‘ ధనిక్ భారత్ ’ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆవిర్భవించాయని స్పష్టం చేశారు.
ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో విశేష అనుభవం ఉన్న లాయిడ్ గ్రూప్… ఇప్పుడు విద్యారంగంలోనూ అదే ప్రమాణాలను నెలకొల్పాలనే సంకల్పంతో ముందుకు వస్తోందని తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలోనే ఇంటర్మీడియట్‌తో పాటు IIT–JEE, NEET ఫౌండేషన్ కోర్సులు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ధనిక్ భారత్ అకాడమీ ద్వారా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ( వైజాగ్ ) నగరాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్, IIT–JEE, NEET కోర్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న లాయిడ్ గ్రూప్… తెలుగు రాష్ట్రాల్లో సేవలందించడం తమకు ప్రత్యేక సంతృప్తినిస్తుందని విక్రం నారాయణ రావు పేర్కొన్నారు. కేవలం ర్యాంకులు, ఫలితాలకే పరిమితం కాని విద్య కాన్సెప్ట్, ఆధారిత లోతైన బోధన, స్ట్రెస్-ఫ్రీ లెర్నింగ్ వాతావరణం, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకతకు ప్రోత్సాహం వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాల అభివృద్ధి ఇంటర్మీడియట్‌కి నూతన దృక్పథం, ఇంటర్మీడియట్ దశ విద్యార్థి జీవితంలో కీలకమైన మార్పు దశ అని విక్రమ్ నారాయణ రావు తెలిపారు. ప్రారంభ దశలో ఇంటర్మీడియట్ విద్యపై ప్రధానంగా దృష్టి పెట్టనున్న ధనిక్ భారత్ అకాడమీ… రాబోయే సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని నిర్వాహకులు వెల్లడించారు.
ధనిక్ భారత్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు మాట్లాడుతూ… భారత్‌ను విశ్వగురు స్థానంలో నిలబెట్టడమే మా లక్ష్యమని… అందుకోసం విద్యార్థులకు AI, మెటావర్స్, స్మార్ట్ టెక్నాలజీ ఆధారిత ఆధునిక విద్యను అందిస్తున్నామని తెలిపారు. అమ్మాయిల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని వివరించారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి చేరేలా, ఉద్యోగావకాశాలు పొందేలా, స్టార్టప్‌లు నెలకొల్పేలా మేము మార్గనిర్దేశం చేస్తామని తెలిపారు. సంప్రదాయ బోధనకు భిన్నంగా Modern Learning – Smart Learning విధానాన్ని అమలు చేస్తున్నామని, కాన్సెప్ట్ క్లారిటీకి పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. ర్యాంకులకే కాదు… జీవితానికి ఉపయోగపడే విద్య అని, ధనిక్ భారత్ అకాడమీ ప్రత్యేకతలు వివరించారు.
IIT–JEE, NEET పేరుతో విద్యార్థులపై అనవసరమైన మానసిక ఒత్తిడి పెడుతున్నారపి… దానికి భిన్నంగా, పాఠ్యాంశాల కాన్సెప్ట్‌లను లోతుగా, స్పష్టంగా అర్థమయ్యేలా బోధించడమే ధనిక్ భారత్ అకాడమీ ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. విద్యతో పాటు విలువలు, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందించే దిశగా అకాడమీ పని చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్లు విక్రం అజయ్ బాబు, విక్రం సురేంద్రబాబు, కె.సాంబశివరావు, కొండమూడి రవీంద్ర కుమార్, ఏ.గిరిబాబు, అంచ రాంబాబు, పెండెల మస్తాన్ రావు, డాక్టర్ సలీం తదితరులు పాల్గొని.. విద్యారంగంలో మార్పులకు వేదికగా ధనిక్ భారత్ అకాడమీ నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.














Leave a Reply