యూరియా కొర‌త‌తో రైతులు ఇబ్బందులుప‌డుతుంటే చేతులెత్తేసిన‌ ప్ర‌భుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

యూరియా కొర‌త‌తో రైతులు ఇబ్బందులుప‌డుతుంటే చేతులెత్తేసిన‌ ప్ర‌భుత్వం

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 25, అద్దం న్యూస్ :       గత 3 నెలలుగా రాష్ట్ర రైతాంగ యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నా ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొర‌త లేదంటూ చేతులెత్తి వేయడం దురదృష్టకరమని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. హైద‌రాబాద్ దోమ‌లగూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… యూరియా కోసం ప్రజలు రైతులు క్యూలైన్లలో నిలబడి రైతులు నానా యాతనా పడుతుంటే…ఎవరు యూరియా గురించి అడిగితే వారిపై లాఠీలతో పాశవికంగా రైతుల నోరు నొక్కాలనే ప్రయత్నం చేస్తుందని ధ్వ‌జ‌మెత్తారు. ఇలా దాడి చేయ‌డం విచారకరమ‌ని, ప్రజాస్వామ్యానికి నిలువెత్తు అపహాస్యమని అన్నారు. ఇటీవల కాలంలో యూరియా కోసం క్యూలైన్‌ల్లో నిలబడ్డ గిరిజన యువకుడ్ని అకారణంగా చిత్ర హింసలు పాలుచేసి పోలీసులు అరెస్టు చేయడం ప్రభుత్వ ధమన నీతికి నిదర్శనమని అన్నారు. ఇటువంటి విధానాలతో అర చేయి అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని లాఠీలతో పోలీసుల బెదిరింపులతో భయభ్రాంతుల‌ను చేసి అరెస్టులు చేసినంత మాత్రాన ప్రభుత్వం చేతగానితనాన్ని కప్పి పుచ్చుకోలేదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై తగు చర్యలు తీసుకునే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, పంచాయతీరాజ్ పెండింగ్ బిల్లులు, ఫీజు రియింబ‌ర్స్‌మెంట్ మంజూరు కాక విద్యార్థుల ఇకట్లు, ఈ విధంగా అన్నిరంగాలలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింద‌ని సాయిబాబా అన్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇంకా కొత్తగా ఏదో చేస్తామంటూ ప్రజలను మభ్య పెట్టడం సరికాదని అన్నారు. దీనికి తోడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామంటూ పలకడం విడ్డూరంగా ఉందన్నారు.                                                     గొప్పలు చెప్పుకోవడం మానుకొని ప్రజల వద్దకు వెళ్లి జరిగిన అభివృద్ధి ఏమిటో కనుక్కోవాలని సూచించారు. రాష్ట్రంలో మంత్రులు ఎవరికి వారు ఐదు పది కిలోమీటర్ల కూడా హెలికాప్టర్ వాడే ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. చీటికి మాటికి ఢిల్లీ పెద్దల ప్రదక్షిణాలు చేస్తూ కాలయాపనలతో ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం ప్రభుత్వానికి తగదని అన్నారు. ఇప్పటికైనా ఈ డంబాచార మాటలు కట్టిపెట్టి ప్రజలకు మంచిపాలన సుపాలన అందించాలని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page