అందరి విముక్తిలోనే ట్రాన్స్ జెండర్ల విముక్తి ఉంది
– ఆల్ ఇండియా ట్రాన్స్ జెండర్ల యాక్టివిస్ట్ రచన
హైదరాబాద్, అక్టోబర్ 7, అద్దం న్యూస్ : అందరి విముక్తిలోనే ట్రాన్స్ జెండర్ల విముక్తి ఉందని ఆల్ ఇండియా ట్రాన్స్ జెండర్ల యాక్టివిస్ట్ రచన అన్నారు. ట్రాన్స్ జెండర్, హిజ్రాల హక్కులు, బాధ్యతలు గుర్తించాలని, అడుక్కోవడం దగ్గర మన గొంతులు పెంచడం కాదు హక్కుల విషయంలో గొంతులు పెంచాలి ప్రభుత్వం మెడలు వంచాలని అన్నారు. ట్రాన్స్ జెండర్లు ప్రజలతో మమేకంగా కావాలని, ట్రాన్స్ జెండర్ల సమస్యలను హక్కులను ప్రభుత్వాలకు అర్థం చేయించాలని, హక్కుల కోసం పోరాడుతూనే ప్రజలతో బాధ్యతగా వ్యవహరించాలని, భయం, బాధ్యత రెండిటిపై అవగాహన కోసం మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ట్రాన్స్ జెండర్లు, హిజ్రాల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ట్రాన్స్ జెండర్ల యాక్టివిస్ట్ రచన మాట్లాడుతూ… సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తాం వివక్ష, హింసను అంతం చేస్తామన్నారు. ట్రాన్స్ పీపుల్స్ రైట్స్‌ను హ్యూమన్ రైట్స్‌గా పరిగణించాలన్నారు. తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ … తెలంగాణలోని హిజ్రాలు ట్రాన్స్ జెండర్లు సుమారు 3 లక్షల మంది ఉన్నారని, వారి సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారన్నారు. విద్య, వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గృహనిర్మాణం, కమ్యూనిటీహాల్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు.
దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి సమానమైన హక్కులు ఉండాలని, మన రాజ్యాంగం చెపుతుందన్నారు. తెలంగాణ హిజ్రా, ట్రాన్స్ జెండర్ల అసోసియేషన్ అధ్యక్షురాలు మోనాలిసా మాట్లాడుతూ… హిజ్రాలు ట్రాన్స్ జెండర్లు అంటే అడుక్కోవడం వ్యభిచారం చేయడమేనా మనుషుల్లా మమ్మల్ని గుర్తించాలన్నారు. హిజ్రాల సముదాయం కమ్యూనిటీహాల్స్ నిర్మించాలని, తెలంగాణ ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ రైట్స్‌ను వెంటనే అమలు చేయాలని అన్నారు. పీవోడబ్ల్యు నాయకురాలు సంధ్య, సామాజిక వేత్తలు కొండవీటి సత్యవతి, సజయా తదితరులు మాట్లాడుతూ… ట్రాన్స్ జెండర్లు ప్రజలను అర్ధం చేసుకోవాలని, ట్రాన్స్ జెండర్ సమస్యలను ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. లింగ మార్పిడి చేసుకోవడానికి అవసరమైన సహాయం ప్రభుత్వం చేయాలన్నారు. దేశంలో హిజ్రాలు ట్రాన్స్ జెండర్లు అరువనీలు, తిరునంగీలు, జోగప్పలు శివసత్తులు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారని, వీరందరికీ సమాన హక్కులు కల్పించాలని కోరారు. తెలంగాణలో ప్రత్యేక సర్వేలు చేసి హక్కులను గుర్తించి ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్ 60 మంది గురువులు, సంఘమిత్ర, సోనీ, మనోరమ, ప్రియా, శిల్ప, ప్రేమమ్మ, శోభ, సమీరా, యాస్మిన్, సోనా రథోడ్, శ్రావణి, సమంత, చిట్టి, నందన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతి త్వరలో ట్రాన్స్ జెండర్ హిజ్రాల కల్చరల్ ఫెస్ట్ – 2025 నవంబర్ చివర్లో నిర్వహించి తమ ప్రతిభ పాటవాలు సమాజానికి తెలియజేయాలని తీర్మానించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply