మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరించాలి
– బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్
హైదరాబాద్, డిసెంబర్ 13, అద్దం న్యూస్ : గాంధీనగర్ డివిజన్ పరిధిలోని వివి గిరి నగర్ బస్తీలో ఏర్పడ్డ మంచినీటి సరఫరా లోప్రెషర్ సమస్యను వాటర్ వర్క్స్ అధికారులు పరిష్కరించాలని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ కోరారు. మంచినీటి లో ప్రెషర్ సమస్యను పరిష్కరించాలని వివి గిరి నగర్ బస్తీవాసులు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావనికి ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్ పావని సూచనలతో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ శనివారం వివి గిరి నగర్ బస్తీలో బస్తీవాసులను, వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు. మంచినీటి లోప్రెషర్ సమస్య పై ఆరా తీశారు. బస్తీల్లో మంచినీటి సరఫరా తీవ్రతరంగా ఉందని, ప్రస్తుతం కొనసాగుతున్న మంచినీటి, సీవరేజి నూతన పైప్‌లైన్‌తో త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని వినయ్ అన్నారు. అలాగే ప్రస్తుతం బస్తీవాసులు ఎదుర్కొంటున్న మంచినీటి సరఫరా లో ప్రెషర్ సమస్యపై దృష్టి సారించాలని, సరఫరా సమయంలో సమయపాలన పాటించి, ఎప్పటికప్పుడు బస్తీలోని మంచినీటి సరఫరాను లైన్ మెన్ పర్యవేక్షించాలన్నారు. డివిజన్‌లో నెలకొన్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం పనులు కార్పొరేటర్ పావని పర్యవేక్షణలో జరుగుతున్నాయని బస్తీవాసులకు వినయ్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏరియా ఇన్‌స్పెక్టర్ శంకర్, లైన్ మెన్ మధు, జగన్, బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, సాయి కుమార్, సాయి కృష్ణ యాదవ్, బస్తీ వాసులు అశోక్ కుమార్, రంజిత్, సువర్ణ, రేణుకా, కవిత, రేవతి తదితరులు పాల్గొన్నారు.















Leave a Reply