స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీ చేయరాదన్న నిబంధనను పునరుద్ధరించాలి
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా

హైదరాబాద్, అక్టోబర్ 2, అద్దం న్యూస్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ–జెడ్పిటిసీలకు ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పోటీ చేయరాదన్న నిబంధనను పునరుద్ధరించాలని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా కోరారు. టిడిపి నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ఈ ఎన్నికలలో 1994 తర్వాత మూడో సంతానం కలిగిన వారు పోటీకి అనర్హులుగా ఉన్న నిబందనను మార్చాలని కోరారు. ఏపీలో సీఎం చంద్రబాబు ఈ నిబంధన ఎత్తివేసినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అలాగే కొనసాగిస్తుందన్నారు. గతేడాది కేబినెట్లో ప్రతిపాదన వచ్చినా ఆమోదం పొందలేదని, ఈ నేపథ్యంలో అభ్యర్థుల అర్హతకు సంబంధించిన ఈ నిబంధనను మార్చాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలకు సంబంధించి సంతానం పరిమితి నిబంధనను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించిందని తెలిపారు. 2018 లో కొత్త చట్టాన్ని రూపొందించినప్పుడు కూడా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ నిబంధనను మార్చలేదన్నారు.
ఈసారైనా పంచాయతీరాజ్ చట్టాన్ని పునః సమీక్షించి, స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ వర్గమైన వారు ఇద్దరు పిల్లలకు అంటే ఎక్కువ సంతానం ఉండకూడదనే అనే పాత నిబంధనను కేవలం హిందువులకు మాత్రమే వర్తింపజేయడం సరికాదన్నారు. అన్నివర్గాలకు ఒకే తీరుగా నిబంధన వర్తింప చేయాలని కోరారు. ఈ నిబంధనను పునరుద్ధరించి కనీసం ముగ్గురు పిల్లలు సంతానం కలిగిన వారిని కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply