సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకనుగుణంగా టిడిపి ఏర్పాటైంది
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్ గౌడ్
హైదరాబాద్, ఆగస్టు 18, ( అద్దం న్యూస్ ) : సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకనుగుణంగా టిడిపి ఏర్పాటైందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం వీధిలో బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376 వ జయంతి కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పాపన్న చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలుస బాల్‌రాజ్ గౌడ్ మాట్లాడుతూ… బహుజన పార్టీలు ఎన్ని ఉన్నా సర్వాయి పాపన్న గౌడ్ పేరు చెప్పుకునే రాజకీయం చేస్తున్నారన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌కు నిజమైన వారసులు అంటే తెలుగుదేశం పార్టీ అని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం సర్వాయి పాపన్న గౌడ్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలకనుగుణంగా ఆనాడు దివంగత ఎన్‌టి రామారావు పార్టీని పెట్టి బడుగు, బలహీనవర్గాలకు రాజకీయంలో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లోనే చంద్రబాబు నాయుడు కూడా బహుజనవర్గాలకు తెలుగుదేశం పార్టీలో పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. నేటికి టిడిపి కార్యకర్తల రూపంలో ఇంకా సజీవంగా ఉందని, తెలంగాణలో పుట్టిన తెలుగుదేశం పార్టీ లేదు…పార్టీ పని అయిపోయిందని అనుకునే వారు ఆలోచించుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అయి మళ్లి అధికారంలోకి వచ్చి చెందిన వ్యక్తే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చంద్రమోహన్ గౌడ్, శివ కృష్ణ గౌడ్, శంకర్ గౌడ్, రమేష్ చారి, యాదగిరి, అన్నపూర్ణ, వీణా దేవి, గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply