అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (mana Shankara Varaprasad garu). ఇందులో వెంకటేష్ (Venkatesh) స్పెషల్ క్యామియో చేశారు. ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఒక సాంగ్ ఉంటుందని మేకర్స్ ఇది వరకే క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ పాటకి సంబంధించిన అప్డేట్ ను పంచుకున్నారు.
‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ‘మెగా విక్టరీ మాస్’ (Mega Victory Mass Song) సాంగ్‌ను డిసెంబర్ 30న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. అంతకంటే ముందుగా ఈ సాంగ్ ప్రోమోను డిసెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. బిగ్గెస్ట్ సెలబ్రేషన్ సాంగ్ పాడుకోడానికి, డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉండండి అనే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply