Thursday, November 5, 2026
No menu items!
HomeGREATER HYDERABADహైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో యాదవుల సంపూర్ణ సహకారం ఉండాలి – సీఎం రేవంత్...

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో యాదవుల సంపూర్ణ సహకారం ఉండాలి – సీఎం రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :    హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ సంకల్పానికి యాదవుల సంపూర్ణ సహకారం ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులతో మరింతగా అభివృద్ధి సాధించి, దేశంలోనే ఆదర్శనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని అన్నారు. హైదరాబాద్ ఎన్‌టిఆర్‌ స్టేడియంలో బుధ‌వారం పెద్దఎత్తున నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… హైదరాబాద్ నగరాభివృద్ధిలో యాదవ సోదరుల కృషి ఎంతో ఉందన్నారు. దేశంలో ఎక్కడి నుంచి ఏ పని కోసమైనా నగరానికి వచ్చిన వారందరినీ యాదవ సోదరులు ఆదరించి అక్కున చేర్చుకున్నారని అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో, ఇక్కడ శాంతి భద్రతలను కాపాడటంలో యాదవుల పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. హైదరాబాద్ నగరం జాతీయస్థాయిలో పేరు ప్రతిష్ఠలను సాధించి అభివృద్ధి చెందిన నగరంగా నిలబెట్టడంలో యాదవ సోదరులు కష్టపడాలని కోరారు. యాదవుల ఆత్మగౌరవం, హక్కులను కాపాడే విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత తనదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సదర్ సమ్మేళనాన్ని అధికారికంగా నిర్వహించలేదని గుర్తుచేస్తూ, తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యాదవ సోదరుల విజ్ఞప్తి మేరకు సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ఉత్సవంగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు విడుదల చేసినట్టు తెలిపారు.

మొట్టమొదటిసారిగా కులగణన చేసి దేశానికి మార్గదర్శకంగా నిలబడ్డామని చెబుతూ, ఎవరెంత మేరకు ఉంటే అంత శాతం వాటా కల్పించాలన్న లక్ష్యంతో కులగణన చేశామని అన్నారు. యాదవులకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించామన్నారు. ఈశ్వరమ్మ యాదవ్ కు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పాలకమండలి సభ్యురాలిగా నియమించడమే కాకుండా యాదగిరిగుట్ట గోశాల బాధ్యతలను కూడా అప్పగించామని తెలిపారు. ఈ సదర్ ఉత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎంపీలు అనిల్ కుమార్‌ యాదవ్‌, మల్లు రవి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ ధర్మేంద్ర యాదవ్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పలువురు ప్రజాప్రతినిధులు, శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌ ఉత్సవ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ యాద‌వ్‌, వివిధ రాష్ట్రాలకు చెందిన యాదవ ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page