షాపులో చోరి ? ముషీరాబాద్ పిఎస్‌లో బాధితుడి ఫిర్యాదు

 

హైదరాబాద్, ఏప్రిల్ 3 ( అద్దం న్యూస్ ) : త‌న హోమ్ అప్ల‌య‌న్సెస్‌ హ్యాండీ క్రాఫ్ట్స్ దుకాణంలో చోరి జ‌రిగింద‌ని బాధితుడు ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ సంద‌ర్భంగా బాధితుడు ఉద‌య్ కుమార్ ” అద్దం న్యూస్ “ ప్ర‌తినిధితో మాట్లాడుతూ… ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని గాంధీన‌గ‌ర్ న‌ర్మ‌దా ఆసుప‌త్రి ఎదురుగా విజ‌య ట్రేడ‌ర్స్ పేరు హోమ్ అప్ల‌య‌న్సెస్‌ హ్యాండీ క్రాఫ్ట్స్ దుకాణాన్ని గ‌త 18 సంవ‌త్స‌రాల నుంచి కొన‌సాగిస్తున‌న్నారు. రోజు మాదిరిగానే బుధ‌వారం రాత్రి 10 గంట‌ల సమయంలో దుకాణాన్ని మూసి వేసి ఇంటికి వెళ్లాన‌ని, తిరిగి గురువారం ఉద‌యం షాపు తెరిచేందుకు రాగా త‌న దుకాణంలో ఉండాల్సిన 5 నుంచి 6 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన హోమ్ అప్ల‌య‌న్సెస్‌ హ్యాండీ క్రాఫ్ట్స్ వ‌స్తువులు ఏవి క‌న‌బ‌డ‌లేదు. చోరీ జ‌రిగింద‌ని గుర్తించాన‌న్నారు. అదే స‌మ‌యంలో అక్క‌డే త‌న షాపు వ‌ద్ద‌ వేరే ఎవ‌రో తెలియ‌ని వ్య‌క్త‌లు ఉన్నార‌న్నారు. వారిని మీరు ఎవ‌రు అని అడిగితే షాపులో మమ్మ‌ల్ని షాపు ఓన‌రు ఉండ‌మ‌న్నార‌ని హిందీలో చెబుతున్నారు.. త‌ప్పా మ‌రే విష‌యం చెప్ప‌లేదు. దీంతో తాను డ‌య‌ల్ 100 కు ఫోన్ చేశాన‌ని, వెంట‌నే పోలీసు సిబ్బంది త‌న దుకాణం వ‌ద్ద‌కు వ‌చ్చార‌ని తెలిపారు. వారి సూచ‌న మేర‌కు ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్‌లో త‌న దుకాణంలో చోరి జ‌రిగింద‌ని.. త‌న షాపు ఓన‌రు ఈశ్వ‌ర‌ల‌క్ష్మే ఇదంతా చేయించింద‌ని ఫిర్యాదు చేశాన‌ని ఉద‌య్ తెలిపారు. చోరి చేసిన వారిని గుర్తించి వారి పై కేసు న‌మోదు చేసి, చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు తీసుకుని త‌న‌కు న్యాయం చేయాల‌ని ఫిర్యాదు చేశాన‌న్నారు. గ‌త నెల‌లో కూడా ముగ్గురు వ్యక్తులు త‌న దుకాణంలో సామానుల‌ను త‌ర‌లిస్తుండ‌గా తాను డ‌య‌ల్ 100 కు ఫోన్ చేయ‌గా పోలీసులు వ‌చ్చి షాపు ఓన‌రు ఈశ్వ‌ర‌ల‌క్ష్మీని పిలిచి మంద‌లించార‌ని ఉద‌య్ చెప్పాడు.

ఇరువ‌ర్గాలను పిలిపిస్తేనే వాస్త‌వాలు బ‌య‌ట‌ప‌డుతాయి

   – ముషీరాబాద్ పిఎస్ డిఐ న‌దీమ్ హుస్సేన్‌

న‌ర్మ‌దా ఆసుప‌త్రి ఎదురుగా ఉన్న హోమ్ అప్ల‌య‌న్సెస్‌ హ్యాండీ క్రాఫ్ట్స్ దుకాణంలో చోరి జ‌రిగిందని వ‌చ్చిన ఫిర్యాదు విష‌యంలో ” అద్దం న్యూస్ “ ప్ర‌తినిధి ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ డిఐ ఎండి.న‌దీమ్ హుస్సేన్ ను వివ‌ర‌ణ కోర‌గా ఆయ‌న స్పందించారు. ఉద‌య్ కుమార్ అనే వ్య‌క్తి త‌న దుకాణంలో చోరి జ‌రిగింద‌ని ఫిర్యాదు చేశాడ‌ని, బాధితుడు చెప్పిన ప‌రంగా చూస్తే షాపు ఓన‌ర్‌కు, త‌న‌కు షాపు విష‌యంలో వివాదం ఉన్న‌ట్లు తెలిసింద‌ని డిఐ తెలిపారు. సిసి కెమెరాల‌ను ప‌రిశీలించామ‌ని, క్లారిటీ రాలేద‌న్నారు. శుక్ర‌వారం ఇరువ‌ర్గాల‌ను స్టేష‌న్‌కు పిలిపించనున్న‌ట్లు తెలిపారు. దుకాణంలో షాపు ఓన‌రు ప్ర‌మేయం ఉందా ? లేదా ? అనేది విచారిస్తామ‌ని, ఓన‌రు ప్ర‌మేయం లేక‌పోతే కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తామ‌న్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page