ఇది నా కెరీర్‌కి మైలురాయి: సుస్మిత కొణిదెల

ఇది నా కెరీర్‌కి మైలురాయి: సుస్మిత కొణిదెల

 

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ‘‘కామెడీ, యాక్షన్, ఎమోషన్‌ అన్నీ ఉన్న సినిమా ‘మన శంకర వరప్రసాద్‌ గారు’. ఇన్నాళ్లు చిరంజీవి నుంచి ఏమైతే మిస్‌ అయ్యామో అవన్నీ దీంట్లో ఉంటాయి. ఇది ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల. వాళ్లిద్దరూ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి టైటిల్‌ పాత్ర పోషించారు. అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు. నయనతార కథానాయికగా నటించగా.. వెంకటేశ్‌ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈనెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

‘‘సెన్సార్‌ వాళ్లు సినిమా చూసి చాలా నవ్వుకున్నారు. పిల్లలతో కలిసి చూసే సినిమాలా ఉందని మెచ్చుకున్నారు. అలాగే ట్రైలర్‌ చూసి చిరంజీవి, వెంకటేశ్‌ల అభిమానులంతా చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎందుకంటే తొలిసారి ఇద్దరు స్టార్స్‌ కలిసి నటించిన సినిమా కావడం అందరిలోనూ ఆసక్తిరేకెత్తిస్తోంది. వాళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉండటం వల్ల చాలా ఇష్టంగా కలిసి పని చేశారు. సినిమాలో వాళ్లిద్దరి మధ్య చాలా ఫన్నీ సీన్స్‌ ఉన్నాయి. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లోనూ వాళ్లిద్దరూ కలిసి పాల్గొంటారు. అలాగే నయనతార, చిరు మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయన్నది ట్రైలర్‌లో శాంపిల్‌గా చూపించాం. ఆ భార్యాభర్తల ట్రాక్‌ సినిమాలో మరో స్థాయిలో అలరిస్తుంది’’ అన్నారు.

ఇది నా కెరీర్‌కి మైలురాయి: సుస్మిత కొణిదెల

‘‘ఇది మంచి కుటుంబ కథా చిత్రం. అసభ్యతకు తావులేకుండా మంచి వినోదంతో నిండి ఉంటుంది. నా కెరీర్‌కు మైలురాయి లాంటి సినిమా ఇది. దీంట్లో భాగమవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఇది నాన్నకి ఎంతో ఇష్టమైన కామెడీ జానర్‌ సినిమా కావడం.. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించడం.. సాహు గారపాటితో కలిసి నేను నిర్మించడం.. ఈ ప్రయాణాన్ని ఆద్యంతం ఆస్వాదించా. ఈ కథలో వెంకటేశ్‌ పాత్రకు చాలా ప్రాధాన్యముంది. ఆయన తెరపైకి వచ్చినప్పటి నుంచి సినిమాలో వినోదం ఒక్కసారిగా రెట్టింపవుతుంది. దీంట్లో ఆయన పోషించిన పాత్రకు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో చేసిన పాత్రకు ఏ పోలిక ఉండదు’’.

‘‘ఈ చిత్ర టీజర్, ట్రైలర్‌లలో నాన్నని చూసిన వాళ్లంతా.. 30ఏళ్ల క్రితం ‘రౌడీ అల్లుడు’లో చిరంజీవిని చూసినట్లుందని మెచ్చుకుంటున్నారు. ఈ కథ నాన్నకి బాగా నచ్చడంతో.. ఈ సినిమా కోసం ఆయన ఓ కొత్త మీటర్‌ పట్టుకున్నారు. కొత్తదనం నిండిన నటనతో తెరపై చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు. దీంట్లో తన లుక్‌ కోసం నాన్న కఠిన కసరత్తులు చేశారు. గతంతో పోలిస్తే ఫిట్‌నెస్‌ చాలా పెంచారు. ఫలితంగానే తెరపై ఓ స్పెషల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. అందుకే మేము కూడా ఆయన ఫిట్‌నెస్‌కు తగ్గ డ్రెస్‌లే వేయాలి.. అవి ఇప్పటి కల్ట్‌ యువతరానికీ నచ్చేలా ఉండాలని కాస్ట్యూమ్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అనిల్‌ రావిపూడి కూడా తను నాన్నని ఎలా చూడాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. దానివల్ల ఆయనకు స్టైలింగ్‌ చేయడం మాకు తేలికైంది’’.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page