Wednesday, November 18, 2026
No menu items!
HomeCrime Newsముషీరాబాద్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో 3వ తరగతి విద్యార్థిని మృతి

ముషీరాబాద్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో 3వ తరగతి విద్యార్థిని మృతి

📰 Generate e-Paper Clip

మరో విద్యార్థిని నందిని కి గాయాలు

హైద‌రాబాద్ క్రైమ్‌, ( అద్దం న్యూస్ ) :    హైద‌రాబాద్ న‌గ‌రంలోని ముషీరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోని నైటింగెల్ హోమ్ ఫ‌ర్ గ‌ర్ల్స్ హోమ్ భ‌వ‌నం పై నుంచి వెళ్తున్న 11 కెవి హై టెన్ష‌న్ విద్యుత్ తీగ‌ల‌కు ప్ర‌మాద‌వ‌శాత్తూ త‌గిలి షాక్‌కు గురై మూడ‌వ తరగతి చదువుతున్న విద్యార్థిని రెబెకా ( 10 ) మృతి చెందింది. ఈ ఘటనలో మరో విద్యార్థిని నందిని గాయపడింది. ముషీరాబాద్ పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి… ముషీరాబాద్ ప్ర‌భుత్వం పాఠ‌శాల ప్రాంగంణ‌లోని నైటింగెల్ హోమ్ ఫ‌ర్ గ‌ర్ల్స్ హోమ్ లో ఉండే రెబెకా (10 ), నందిని ( 14 ), ప్రియ‌ద‌ర్శిని ( 12 ) లు సోమ‌వారం సాయంత్రం 4:30 గంట‌ల స‌మ‌యంలో హోమ్ భ‌వ‌నం పైకి ఎక్కారు. భ‌వ‌నం పై అప్ప‌టికే ఫ్లోర్ తుడిచే ఇనుప మాప్ స్టిక్ ప‌డి ఉంది. రెబెకా ఆ స్టిక్‌ను ప‌ట్టుకుని ఆడుకుంటుండ‌గా ఆ హోమ్ పై ఉన్న 11 కెవి హైటెన్షన్ విద్యుత్ తీగలకు ఆ ఇనుప మాప్ స్టిక్ తగలడంతో రెబెకా కు షాక్ త‌గిలింది. విద్యుత్ షాక్ కు గురైన రెబెకా తీవ్ర గాయాల‌య్యాయి.

   రెబెకా ను కాపాడే ప్ర‌య‌త్నంలో నందిని అనే విద్యార్థిని చేయి మడ‌మ పై భాగంలో గాయ‌మైంది. విష‌యాన్ని ప్రియ‌ద‌ర్శిని హోమ్ ప్రాజెక్ట్ ఇన్‌చార్జ్ న‌మ్ర‌త కు చెప్ప‌గా, ఆమె స్థానిక ముషీరాబాద్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. పోలీసులు వ‌చ్చి రెబెకా ను, నందిని ల‌ను గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రికి వెళ్లిన కొద్ది సేప‌టికే రెబెకా మృతి చెందిన‌ట్టు వైద్యులు తెలిపారు. నందిని కి వైద్యం అంద‌చేసి సోమ‌వారం రాత్రే హోమ్‌కు త‌ర‌లించారు. మృతురాలు రెబెకా రైల్ నిల‌యం వ‌ద్ద ఉండే అంబేద్క‌ర్ న‌గ‌ర్ బ‌స్తీకి చెందింద‌ని, నైటింగెల్ హోమ్ ఫ‌ర్ గ‌ర్ల్స్ హోమ్‌లో ఈ సంవ‌త్స‌రం జూన్‌లో జాయిన్ అయింది. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page