Wednesday, November 18, 2026
No menu items!
HomeGREATER HYDERABADడ్రగ్స్, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

డ్రగ్స్, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

తార్నాక, నవంబర్ 17, ( అద్దం న్యూస్ ) :     తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి నిర్మూలనతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని మంగ‌ళ‌వారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గొరంట్ల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, చట్టపరమైన అనేక నష్టాలు ఎదురవుతాయని వివరించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

       ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని, ప్రణాళికాబద్ధంగా కృషి చేసి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. తద్వారా తల్లిదండ్రులకు, గురువులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page