Wednesday, November 18, 2026
No menu items!
HomeGREATER HYDERABADకొత్త పింఛ‌న్ల మంజూరు పత్రాలను అందించిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

కొత్త పింఛ‌న్ల మంజూరు పత్రాలను అందించిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

📰 Generate e-Paper Clip

సికింద్రాబాద్, ( అద్దం న్యూస్ ) :     సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చేయూత కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ సోమవారం ప్రారంభించారు. సీతాఫలమండీలోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్‌లో జ‌రిగిన కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని కొత్త పింఛనుదారులకు మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ… 2014 సంవత్సరానికి ముందు కాలంలో తొలుత సికింద్రాబాద్ నియోజకవర్గం చాలీ…చాలని పింఛన్ల డబ్బులకు కార్యాలయాల చుట్టు తిరుగుతూ దళారీలను ప్రజలు ఆశ్రయిస్తున్నట్లు గుర్తించి తాను ఎంఎల్ఏ గా ఎన్నికైన వెంటనే సీతాఫల్‌మండీలో ఎంఎల్ఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, నిత్యం ప్రజలకు అందుబాటులో కార్యాలయం నిలిచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దాంతో తొలుత 2017 నాటికి సికింద్రాబాద్ పరిధిలో అన్ని రీతులకు చెందిన ఆసరా పింఛనుదారులకు సంఖ్య 15,444 కు చేరుకోగా వారిలో సుమారు 7 వేల మంది వితంతువులు, 2 వేల మంది వికలాంగులు ఉన్నారని తెలిపారు. క్రమంగా అర్హుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు తన కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు జరిపి ప్రభుత్వ అధికారుల కార్యాలయాల చుట్టూ దరఖాస్తుదారులు చెప్పులరిగేలా తిరగాల్సిన అగత్యాన్ని నివారించామని తెలిపారు. ఈ క్రమంలో 15 వేల మందికి అదనంగా 2021లో మరో 6 వేల మందికి పింఛ‌న్లు మంజురయ్యాయని వివరించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది వార్డులకు సంబంధించి మారేడుపల్లి, ముషీరాబాద్ ఎంఆర్ఓ కార్యాలయాల ద్వారా ప్రస్తుతం వరకు సుమారుగా 21, 554 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారని వారిలో 7072 OAP, 10,207 WP, 3533 ( disabled ), 701 ( SW ), 41 ( BW ) పింఛ‌న్లు పొందుతున్నారని వివరించారు. సామాజిక భద్రత కోసం వికలాంగులు, వృద్దులు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏటా సుమారుగా రూ.45.26 కోట్లు ఖర్చుతో 21 వేల మందికి ఆసరా పింఛ‌న్లకు ఇప్పటి వరకు అందించామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో దళారీల ప్రమేయాన్ని పూర్తిగా నివారించేదుకు ఏర్పాటు జరిపి తన సీతాఫలమండీ కార్యాలయాన్ని నేరుగా ప్రజలు సంప్రదించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

2023 సంవత్సరం తరువాత కొత్తగా ముషీరాబాద్ మండలం పరిధిలోని ప్రాంతాలల్లో 1042, మారేడుపల్లి మండలం పరిధిలో 809 మందికి చేయూత పింఛ‌న్లు ( వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ) మంజురయ్యాయని, దాంతో అందరు పింఛ‌నర్ల సంఖ్య సుమారు 23 వేలకు తాజాగా చేరిందని తెలిపారు. అర్హులైన అందరికి పింఛ‌న్లు అందించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన మొత్తాల్లో పింఛ‌ను డబ్బులు ప్రతి నేలా ఒకటో తేదిన అందించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. అదే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చని పక్షంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛ‌నుదారుల పై దృష్టి పెడతామని స్పస్టం చేశారు. మారేడుపల్లి త‌హ‌శిల్థార్‌ అసమదుల్లా ఖాన్, ముషీరాబాద్ త‌హ‌శిల్థార్‌ అప్పికట్ల చందన రాణి, అధికారులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page