Wednesday, November 18, 2026
No menu items!
Homecinemaఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ షరీఫ్ మహమ్మద్ కు విశిష్ట కళా సామ్రాట్ ...

ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ షరీఫ్ మహమ్మద్ కు విశిష్ట కళా సామ్రాట్ పురస్కారం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 17, ( అద్దం న్యూస్ ) :     

విశిష్ట కళా సామ్రాట్‌గా దూరదర్శన్ మొదటితరం న్యూస్ రీడర్, ఫిల్మ్ &టీవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్,నంది అవార్డు గ్రహీత మహమ్మద్ షర్ఫుద్దీన్ అలియాస్ షరీఫ్ మహమ్మద్ కు ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో బహుకరించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిల్మ్ & టీవీ రంగంలో ప్రొడ్యూసర్, డైరెక్టర్, రచయితగా, నాలుగు దశబ్దాలుగా విశేష సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా షరీఫ్ కు ఈ అవార్డును బహుకరించారు. భారత్ కల్చరల్ అకాడమీ 29వ వార్షికోత్సవం, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ప్రముఖ హాస్య నటులు, మాజీ మంత్రి బాబు మోహన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, సినీ న‌టుడు సుమన్, మాజీ ఐఏఎస్ అధికారి పార్థసారధి, భారత్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్‌, తెలంగాణ బిసి కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ చేతుల మీదుగా షరీఫ్ మహమ్మద్ ఈ విశిష్ట కళా సామ్రాట్ పురస్కారం స్వీకరించారు.

       ప్రముఖ సినీ నిర్మాత రాంసత్యనారాయణ, వివిఆర్ రియల్ ఎస్టేట్ ఛైర్మన్ విజయ్ కుమార్ నిర్వాహకులు హాజరయ్యారు. పాత తరం ప్రముఖ హీరో కత్తి కాంతారావు స్మారక పురస్కారం-2026ను సినీ హీరో, యాక్షన్ స్టార్ సుమన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశిష్ట కళా సామ్రాట్, విశిష్ట సేవా సామ్రాట్ పురస్కారాలను ప్రముఖులకు బహుకరించారు. విశిష్ట కళా సామ్రాట్ పురస్కారం వకుళాభరణం కృష్ణమోహన్, దూరదర్శన్ మొదటి అనౌన్సర్ విజయదుర్గ, మెట్రో ఈవెనింగ్స్ ఎడిటర్ కాళిదాస్, టీవీ నటి జ్యోతిరెడ్డి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, బాలల రచయిత డి.వెంకటరమణ, ఆర్జే అయుషీ సింగ్, నటుడు చిత్తరంజన్ అందుకున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page