మాజీ జిపిటి మాసబ్ ట్యాంక్ కాలేజ్ అల్యూమిని అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ గౌడ్ కు నివాళి
మాసబ్‌ట్యాంక్, అక్టోబర్ 5, అద్దం న్యూస్ : మాజీ జిపిటి మాసబ్ ట్యాంక్ కాలేజ్ అల్యూమిని అధ్యక్షుడు ఐల శ్రావణ్ కుమార్ గౌడ్ దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం బేగంపేట్ పైగా ప్యాలెస్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబి.కృష్ణ యాదవ్ హాజరై శ్రావణ్ కుమార్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ గౌడ్ మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీకి చేసిన సేవలను కృష్ణయాదవ్ గుర్తు చేసుకున్నారు. శ్రావణ్‌కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అంబటి శ్రీనివాస్, సాల్మన్, కమల్, వినోద్ కుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply