మాజీ జిపిటి మాసబ్ ట్యాంక్ కాలేజ్ అల్యూమిని అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ గౌడ్ కు నివాళి

మాజీ జిపిటి మాసబ్ ట్యాంక్ కాలేజ్ అల్యూమిని అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ గౌడ్ కు నివాళి

మాస‌బ్‌ట్యాంక్‌, అక్టోబ‌ర్ 5, అద్దం న్యూస్ :     మాజీ జిపిటి మాసబ్ ట్యాంక్ కాలేజ్ అల్యూమిని అధ్యక్షుడు ఐల శ్రావణ్ కుమార్ గౌడ్ దశ‌దిన క‌ర్మ కార్య‌క్ర‌మం ఆదివారం బేగంపేట్‌ పైగా ప్యాలెస్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబి.కృష్ణ యాదవ్ హాజ‌రై శ్రావ‌ణ్ కుమార్ చిత్ర ప‌టానికి పూల‌మాలలేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా శ్రావణ్ కుమార్ గౌడ్ మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీకి చేసిన సేవలను కృష్ణ‌యాద‌వ్‌ గుర్తు చేసుకున్నారు. శ్రావ‌ణ్‌కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అంబటి శ్రీనివాస్, సాల్మన్, కమల్, వినోద్ కుమార్, యాదగిరి త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page