అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదో టెస్టు మ్యాచే తన చివరిదని 39 ఏళ్ల ఖవాజా వెల్లడించాడు. 2011లో ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు ఎంపికైన ఖవాజా తన కెరీర్‌లో 87 టెస్టులు, 40 వన్డేలు, 9 టీ20ల్లో మొత్తం 8001 పరుగులు చేశాడు. టెస్టుల్లో 16 శతకాలు చేశాడు. ఈనెల 4న సిడ్నీ వేదికగా చివరి టెస్టు ప్రారంభం కానుంది.
అద్భుతమైన కెరీర్..
పాకిస్థాన్‌లో జన్మించి, ఆస్ట్రేలియా జాతీయ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన ఖవాజా ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. టెస్టుల్లో 5000కు పైగా పరుగులు చేసిన ఆయన, క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకోవడంలో సిద్ధహస్తుడు. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌కు ఆయనే ప్రధాన బలంగా నిలిచారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply